ఒక టికెట్టు కొంటే మరొకటి ఉచితం
ABN , Publish Date - Dec 21 , 2023 | 03:27 PM
దర్శకుడు కేఆర్ ప్రవేశపెట్టిన ఒక టిక్కెట్టు కొంటే మరొక టిక్కెట్టు ఉచితం అనే ఆఫర్‌ను అగ్రహీరో కమలహాసన్ అభినందించారు. ప్రయోగం విజయవంతం అయితే మరికొన్ని చిన్న చిత్రాలకు ఎంతగానో దోహదపడుతుంది. అందువల్ల ఈ కాన్సెప్టును మరింత ఎంకరేజ్ చేయాలని కోరుతున్నానని కమల్ హాసన్ పేర్కొన్నారు.
ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేఆర్ (KR) తాజాగా ‘ఆయిరం పొర్కాసుగల్’ (Aayiram Porkasugal) చిత్రం నిర్మించగా, ఈచిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రానికి ఒక టిక్కెట్టు కొంటే మరొకటి ఉచితంగా ఇచ్చే ఆఫర్‌ను ప్రకటించారు. విదార్థ్ శరవణన్ - అరుంధతి నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేఆర్ దర్శకుడు. కొంతకాలంగా పెద్ద హీరోలు నటించిన చిత్రాలకు మాత్రమే ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక టిక్కెట్టు కొంటే మరొక టిక్కెట్టు ఉచితం అనే ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆఫర్‌ను అగ్రహీరో కమలహాసన్ (Kamal Haasan) అభినందించారు.
‘తమిళ చిత్ర పరిశ్రమ కొత్త ఆవిష్కరణలు, విప్లవాత్మక మార్పులు చేయడంలో ఎల్లవేళలా ముందుంటుంది. ఈ ఆఫర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. ఈ ప్రయోగం విజయవంతం అయితే మరికొన్ని చిన్న చిత్రాలకు ఎంతగానో దోహదపడుతుంది. అందువల్ల ఈ కాన్సెప్టును మరింత ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా’ అని కమల్ పేర్కొన్నారు.
‘బై వన్ టికెట్.. గెట్ వన్ ఫ్రీ’ ఆఫర్ గురించి చిత్ర దర్శకనిర్మాత కేఆర్ మాట్లాడుతూ.. ఒక సినిమా తలరాతను నిర్ణయించేది మొదటి రోజు మొదటి ఆట. ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు వ్యాపారపరంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. కానీ, మంచి కథలతో వచ్చే చిన్న చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ కరువైంది. చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మించవద్దని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లేదు. అందుకే ఏదో ఒకటి చేసి ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ మూవీ టిక్కెట్ ఆఫర్. పెద్ద చిత్రాలు బ్లాక్‌బస్టర్ విజయం సాధించడం సంతోషంగా ఉన్నప్పటికీ... చిన్న చిత్రాలకు ఆదరణ లేకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. ఇప్పుడున్న అగ్ర నటీనటులు, టెక్నీషియన్లు ఒకప్పుడు చిన్న చిత్రాల్లో నటించి తమ కెరీర్‌ను ప్రారంభించినవారే. అందుకే చిన్న బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలను ప్రోత్సహించేలా ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్ యజమానులతో నాకు మంచి స్నేహసంబంధాలున్నాయి. వారంతా ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచారు. ఈ విధానం నేను నిర్మించిన ‘ఆయిరం పొర్కాసుగల్’ చిత్రంతోనే శ్రీకారం చుడుతున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*బిగ్ బాస్ షో అనేది పిచ్చికి పరాకాష్ట.. ఈ మాట అన్నది ఎవరంటే?
****************************
*Vijay Kiragandur: ‘కాంతార’కే కాదు.. ‘సలార్’ విషయంలోనూ అంతే!
******************************
*ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..? బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో ఇదేం ట్విస్ట్..
******************************