Aalavandhan: 3 గంటలపైన ఉన్న సినిమాని తగ్గించి.. 22 ఏళ్ల తర్వాత డిజిటల్ టెక్నాలజీలో రిలీజ్..
ABN , First Publish Date - 2023-12-10T14:37:30+05:30 IST
2001లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆలవందాన్’. 22 యేళ్ల తరువాత డిజిటల్‌లో విడుదల చేశారు. శుక్రవారం రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలను కమల హాసన్ సమకూర్చడమే కాకుండా హీరో - విలన్ పాత్రల్లో అదరగొట్టారు.
2001లో సురేష్ కృష్ణ (Suresh Krishna) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆలవందాన్’ (Aalavandhan). 22 యేళ్ల తరువాత డిజిటల్‌లో విడుదల చేశారు. శుక్రవారం రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలను కమల హాసన్ సమకూర్చడమే కాకుండా హీరో - విలన్ పాత్రల్లో అదరగొట్టారు. గతంలో విడుదల చేసినపుడు ఈ చిత్రం మూడు గంటలకుపైనే నిడివి ఉండేది. ఇపుడు నిడివిని దాదాపు గంట పాటు తొలగించి, 2కే కిడ్ కోణంలో ప్రస్తుతం విడుదలవుతున్న చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఈ మూవీని తమిళనాడు (Tamil Nadu)తో పాటు ఓవర్సీస్‌లో దాదాపు వెయ్యికిపైగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ వెర్షన్‌లో గ్రాఫిక్స్, మాటలు, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్, యానిమేషన్ సీన్లు, పోరాట సన్నివేశాలు, సంగీతం ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా నేటి చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా తీశారు. నిజానికి 22 యేళ్ళ క్రితం విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇపుడు నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చిత్రాన్ని ఎడిట్ చేసిన తీరు బాగుంది.
ముఖ్యంగా భీతి కొలిపే హత్యలను యానిమేషన్ విధానంలో చూపించడం బాగుంది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను (kalaipuli S Thanu) వి క్రియేషన్స్ బ్యానరుపై నిర్మించిన ఈ చిత్రంలో రవీనా టాండన్, మనీషా కొయిరాలా, అను హాసన్, కిట్టూ గిద్వానీ, మిలింద్ గుణాజి, శ్రీవల్లభ్ వ్యాస్, మేజర్ రవి తదితరులు నటించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Manushi Chhillar: నా గాళ్స్ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!
*******************************
*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం
*************************************
*Guntur Kaaram: మహేష్‌కి ముద్దు.. సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైనట్లే..
*********************************