Actor Prabhu: నాన్నకు తొలి వీరాభిమాని ఆయనే..
ABN , First Publish Date - 2023-06-05T19:02:04+05:30 IST
కరుణానిధి శతజయంతి వేడుకల నిమిత్తం తమిళనాడులో జరిగిన వేడుకలకు నటుడు ప్రభు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నాన్న నడిగర్ తిలకం శివాజీ గణేశన్‌కు తొలి వీరాభిమాని దివంగత డాక్టర్ కలైంజర్ కరుణానిధి అని తెలిపారు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పరాశక్తి’ చిత్రాన్ని స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్స్ థియేటర్‌లో మరోమారు ప్రదర్శించారు.
నడిగర్ తిలగం శివాజీ గణేశన్ (Nadigaiyar Thilagam Sivaji Ganesan)కు తొలి వీరాభిమాని దివంగత డాక్టర్ కలైంజర్ కరుణానిధి (Kalaignar Karunanidhi) అని సీనియర్ నటుడు ప్రభు (Actor Prabhu) పేర్కొన్నారు. కరుణానిధి శతజయంతి (Karunanidhi Centenary Celebrations) వేడుకల్లో భాగంగా ఆదివారం తమిళనాడు (Tamil Nadu) వడపళనిలో జరిగిన ఓ కార్యక్రమంలో డీఎంకే ఎంపీలు దయానిధి మారన్, కనిమొళితో కలిసి నటుడు ప్రభు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘శివాజీ గణేశన్‌కు తొలి వీరాభిమాని కలైంజర్ అని చెప్పవచ్చు. ‘ఏ విధంగా నటిస్తున్నారో చూడండి’ అంటూ సినిమా ప్రదర్శన సాగుతున్న సమయంలోనే కలైంజర్ లేచి శివాజీకి ముద్దులు పెట్టేవారు. టీవీ షోలలో పాల్గొన్నపుడు కూడా ఇలానే చేసేవారు. మా అమ్మ కూడా వారిద్దరి చర్యలు చూసి సిగ్గుపడుతూ హేళన చేసేవారు. అయినా వారిద్దరి అల్లరి ఆగేది కాదు. ఒక నటుడిలోని తెలివి తేటలను వెలికి తీసి, నటుడికి మార్గనిర్దేశం చేసిన చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi). ఇప్పటి సినిమాలలో మాదిరిగా పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేసే హీరోయిన్లుగా కాకుండా, ఆనాడే సామాజిక సమస్యలపై ఆలోచింపజేసేలా, సామాజిక సమస్యలను ప్రస్తావించే హీరోయిన్లుగా వారి పాత్రలను కలైంజర్ మలిచారు’’ అని గుర్తుచేశారు.
కాగా, ఈ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని, స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్స్ థియేటర్‌లో ‘పరాశక్తి’ చిత్రాన్ని మరో మారు ప్రదర్శించారు. ఇక నటుడు ప్రభు విషయానికి వస్తే.. సౌత్‌లో ఇప్పుడాయన బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా తెలుగులోనూ ఆయనకు మంచి మంచి ఆపర్లు వస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
************************************************
*Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విడుదల తేదీ ఫిక్సయింది
*Eega 2: రాజమౌళి ‘ఈగ’ మళ్లీ ఎగురుతుందా?
*Udhayanidhi Stalin: తల్లి, భార్య సమక్షంలో.. ఉదయనిధి సంచలన నిర్ణయం
*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!