Nelson Dilipkumar: ‘జైలర్’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?
ABN , First Publish Date - 2023-08-19T15:02:59+05:30 IST
‘జైలర్’ చిత్ర విజయానికి ప్రధాన కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ పవర్, ఆయన అభిమానులే కారణమని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అన్నారు. ఈనెల 10న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నెల్సన్ దిలీప్ కుమార్ మూవీ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
‘జైలర్’ (Jailer) చిత్ర విజయానికి ప్రధాన కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) పవర్, ఆయన అభిమానులే (Fans) కారణమని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) అన్నారు. ఈనెల 10న విడుదలైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఇందులో దర్శకుడు నెల్సన్ (Nelson) మాట్లాడుతూ.. ‘‘నేను రజనీ వీరాభిమానిని. నిర్మాత కళానిధిమారన్ చిత్ర కథను ఆయన హృదయానికి చాలా దగ్గరగా చూశారు. అందుకే నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. ఈ స్ర్కిప్టుపై తలైవర్‌కు గట్టి నమ్మకం ఉండటం వల్లే ఆయన అభిమానులు ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూశాక అనుకున్నదానికంటే పది రెట్లు బాగా వచ్చిందని మెచ్చుకున్నారు. అనేక మంది నన్ను అపనమ్మకంతో చూస్తే రజనీ సర్ మాత్రం పూర్తి నమ్మకం ఉంచారు. ఆ నమ్మకం నిజమైంది’’ అని అన్నారు.
నటుడు సునీల్ (Sunil) మాట్లాడుతూ... జీవితంలో ఇలాంటి అవకాశం నాకు ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన తలైవర్, దర్శకుడికి, సన్ పిక్చర్స్‌కు ధన్యవాదాలు అని తెలపగా.., నటుడు వసంత్ రవి (Vasanth Ravi) మాట్లాడుతూ... కథా చర్చా సమయంలో చెప్పిన మాటను నెల్సన్ నిలబెట్టుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిందని అన్నారు. నటి మిర్నా, స్టంట్‌మాస్టర్ స్టన్ శివ, నటుడు హర్షద్, గేయ రచయిత సూపర్ సుబ్బు, నటులు జాఫర్, రెడిన్ కింగ్‌స్లీ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
***************************************
*Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?
***************************************
*Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..
***************************************
*Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు
****************************************
*Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం
***************************************