Vijay Sethupathi: షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా..?

ABN , First Publish Date - 2023-01-06T18:21:11+05:30 IST

విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). సౌతిండియాలోనే బిజియెస్ట్ స్టార్స్‌లో ఒకరు. అతడి నుంచి 2022లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి.

Vijay Sethupathi: షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడా..?

విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). సౌతిండియాలోనే బిజియెస్ట్ స్టార్స్‌లో ఒకరు. అతడి నుంచి 2022లో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో మక్కల్ సెల్వన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.

విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వక్కుల రెండు కాదల్’ (Kaathu Vaakula Rendu Kadhal)తో విజయ్ సేతుపతి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో నయనతార, సమంత హీరోయిన్స్‌గా నటించారు. లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ (Vikram) లో అతిథి పాత్రలో మెరిశాడు. ఈ మూవీ కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మలయాళంలో నటించిన '19(1)(a)' మాత్రం నిరాశపరిచింది. మరికొన్ని చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. హీరోగా నటిస్తూనే విలన్ పాత్రలు పోషిస్తుండటంతో ‘మక్కల్ సెల్వన్’ ను అందరు ప్రశంసిస్తున్నారు. కానీ, విజయ్ మాత్రం ఎక్కువ చిత్రాలు చేయాల్సి వస్తుంది. ప్రేక్షకులు చాలా సార్లు చూస్తుండటంతో అతడి చిత్రాలకు ఒపెనింగ్స్ రావడం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. అతిథి పాత్రలను చేయకూడదని అతడు నిర్ణయించుకున్నాడట. రోల్ బాగుంటేనే అతిథి పాత్రలకు సై అని చెప్పాలనుకుంటున్నాడట. ఒక్క ఏడాదిలో కోలీవుడ్‌లో మూడు చిత్రాలు, ఇతర భాషలో మరో చిత్రం చేయాలనుకుంటున్నాడని విజయ్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్లే 2023 నుంచి తక్కువ చిత్రాల్లో మాత్రమే విజయ్ సేతుపతి కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ లో కీలక పాత్ర పోషించాడు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఫర్జీ వెబ్‌సిరీస్‌లోను నటించాడు. షారూఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ లో విలన్‌ పాత్రను పోషిస్తున్నాడు.

Updated Date - 2023-01-06T18:24:06+05:30 IST