SR Prabhu: ఫ్యామిలీ సినిమాలకు యూత్ ఆడియెన్స్ వస్తారా? అనే సందేహం తొలగిపోయింది
ABN , First Publish Date - 2023-10-14T15:06:55+05:30 IST
మంచి కథలకు యువతరం ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని తమ చిత్రం నిరూపించిందని, ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు భవిష్యత్తులో మరిన్ని నిర్మించవచ్చన్న నమ్మకం కలిగించారని నిర్మాత ఎస్.ఆర్.ప్రభు అన్నారు. ఆయన నిర్మించిన ‘ఇరుగపట్రు’ మూవీ మంచి టాక్‌ని సొంతం చేసుకోవడంతో.. యూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఆయన ఈ విధంగా మాట్లాడారు.
మంచి కథలకు యువతరం ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని తమ చిత్రం నిరూపించిందని, ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు భవిష్యత్తులో మరిన్ని నిర్మించవచ్చన్న నమ్మకం కలిగించారని నిర్మాత ఎస్.ఆర్.ప్రభు (SR Prabhu) అన్నారు. పొటెన్షియల్ స్టూడియో బ్యానర్‌పై ఆయన నిర్మాణంలో యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇరుగపట్రు’ (Irugapatru). విక్రమ్ ప్రభు (Vikram Prabhu), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath), విధార్థ్ అపర్ణతి, శ్రీ, సానియా ప్రధాన పాత్రలను పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం. ఈ నెల 6న విడుదలై పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో ‘థ్యాంక్స్ గివింగ్ మీట్’ (Irugapatru Thanks Giving Meet)ను చిత్ర బృందం ఏర్పాటు చేసింది.
ఇందులో నిర్మాత మాట్లాడుతూ..ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సందేహం ఉండేది. పెద్ద చిత్రాలను నిర్మించేటప్పుడు అది ఆడుతుందా? లేదా? అనే ఆలోచన చేయకుండా నిర్మిస్తాం. అదే చిన్న సినిమాల విషయానికొస్తే మాత్రం మంచి చిత్రాన్ని నిర్మించాలని భావిస్తాం. గతంలో అనేక మంది నిర్మాతలకు ఇలాంటి సలహా ఇచ్చాను. కానీ, కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కథ బాగుంటే చిన్న సినిమా అయినా సరే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూస్తారనే నమ్మకం కలిగింది. ఫ్యామిలీ సినిమాలకు యువ ఆడియన్స్ వస్తారా అనే సందేహం నెలకొంది. కానీ, ‘ఇరుగపట్రు’ చిత్రాన్ని మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. అందుకే ఇంత సక్సెస్ సాధించిందని అన్నారు.
దర్శకుడు యువరాజ్ దయాళన్ (Yuvaraj Dhayalan) మాట్లాడుతూ... ఈ చిత్రం చూసిన అనేక మంది తనను ఒక మనోతత్వ నిపుణుడిగా పిలుస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విషయంలో నిర్మాత నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఆర్టిస్ట్‌లందరూ ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోలు విక్రమ్ ప్రభు, విధార్థ్‌తో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు కూడా పాల్గొని.. ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
============================
*Leo: ‘లియో’ ఫస్ట్ డే ఫస్ట్ షో టిక్కెట్ ధర రూ.5 వేలా?
***********************************
*Salaar Vs Dunki: రెబల్ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..
**********************************
*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు
***********************************
*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు
*************************************
*KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..
************************************