Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..

ABN , First Publish Date - 2023-04-27T17:11:52+05:30 IST

ఇందులోని కీలకమైన ‘కణ్మణి’ (Kanmani) అనే పాత్ర ఎవరితో చేయించాలన్న దానిపై మల్లగుల్లాలు పడ్డా. వాస్తవానికి ఈ పాత్రకు

Thangar Bachan: తమిళ తెరకు మరో నందితా దాస్‌ను పరిచయం చేస్తున్నా..
Karumegangal Kalaiginrana Director and Heroine

భారతీరాజా, గౌతం మేనన్‌, మమతా మోహన్‌దాస్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కరుమేఘంగల్‌ కలైడిండ్రన’ (Karumegangal Kalaiginrana). తంగర్‌ బచ్చన్‌ (Thangar Bachan) దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) రిలీజ్‌ చేశారు. చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ (GV Prakash Kumar) సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు తంగర్‌ బచ్చన్‌, హీరోయిన్‌ అదితి బాలన్‌ (Aditi Balan) మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ముందుగా తంగర్‌ బచ్చన్‌ (Director Thangar Bachan) మాట్లాడుతూ.. ‘‘గతంలో నేను రచించిన ‘కరుమేఘంగల్‌ ఏన్‌ కలైగిండ్రన’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. 2003 నుంచి ఈ స్టోరీపై వర్క్‌ చేస్తున్నా. ఇందులోని కీలకమైన ‘కణ్మణి’ (Kanmani) అనే పాత్ర ఎవరితో చేయించాలన్న దానిపై మల్లగుల్లాలు పడ్డా. వాస్తవానికి ఈ పాత్రకు అదితి బాలన్‌ సరిగ్గా సూటవుతారని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఏ ఒక్కరూ ఆ అమ్మాయి పేరును చెప్పలేదు. అదితి బాలన్‌ నటించిన ‘అరువి’ చిత్రాన్ని నేను ఆలస్యంగా చూశా. ఆ వెంటనే మరు క్షణం ఆలస్యం చేయకుండా ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకొచ్చా. ఇందులో ఆమె పాత్ర చాలా బాగా వచ్చింది. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఆమె నటించారు. ‘అళగి’ ఫేం నందితా దాస్‌ ఏ విధంగా నటించారో ఆ విధంగా అదితి బాలన్‌ నటన ఉంది. తమిళ తెరకు మరో నందితా దాస్‌ (Nanditha Das)ను పరిచయం చేస్తున్నా. న్యాయవాది పాత్రకు భారతీరాజా న్యాయం చేస్తారని భావించే ఆయనని ఎంచుకున్నా. నేను ఊహించినదానికంటే ఆయన పాత్ర చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ ఒక్క పైసా తీసుకోకుండా సంగీతం సమకూర్చుతున్నారు. ‘అళగి’ వంటి చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వాలని జీవీ కోరారు. ఈ సినిమా ఆ స్థాయిలో మంచి పేరు తెస్తుందని అతనే చెప్పారు’’ అని తంగర్‌ బచ్చన్ చెప్పుకొచ్చారు.

Kamal-Haasan.jpg

అదితి బాలన్‌ (Aditi Balan) మాట్లాడుతూ.. ‘‘కథను వివరించే సమయంలోనే తంగర్‌ బచ్చన్‌ హావభావాలను వెల్లడిస్తారు. ఆయన దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే, భారతీరాజాతో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతినిచ్చింది’’ అని చెప్పారు. కాగా.. ఈ చిత్రాన్ని విఏయు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి. వీరశక్తి నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Kundavai: యువరాణి కుందవై ఇతర పేర్లు ఏంటి?

*Samuthirakani: పవన్ కల్యాణ్ లెటర్‌కు సముద్రఖని స్పందనిదే..

* Samantha: సమంతని వదలని చిట్టిబాబు.. ఇదో ‘రంగస్థలం’ అవుతుందేమో..

*Samantha: ఆంధ్రప్రదేశ్‌లో హీరోయిన్ సమంతకు గుడి.. ప్రారంభం ఎప్పుడంటే?

*Kushboo: క్యాండిల్‌ వెలుగులో మేకప్‌ వేసుకున్నాం

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ అస్సలు తగ్గట్లేదుగా..

Updated Date - 2023-04-27T17:11:52+05:30 IST