Karthi: కార్తీయిజానికి ‘16 ఏళ్ళు’

ABN , First Publish Date - 2023-02-25T23:05:41+05:30 IST

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు శివకుమార్‌ (Siva Kumar) వారసుల్లో ఒకరైన కార్తీ (Karthi) చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా

Karthi: కార్తీయిజానికి ‘16 ఏళ్ళు’
Karthi

కోలీవుడ్‌ సీనియర్‌ నటుడు శివకుమార్‌ (Siva Kumar) వారసుల్లో ఒకరైన కార్తీ (Karthi) చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2007లో అమీర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పరుత్తి వీరన్‌’ (Paruthiveeran) మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన కార్తీ.. ఇపుడు తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్రనటుడి స్థాయికి ఎదిగారు. టాలీవుడ్‌లోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నారు. 2021 ఆఖరులో వచ్చిన ‘సుల్తాన్‌’ (Sulthan), 2022లో వచ్చిన ‘విరుమన్‌’ (Viruman), ‘సర్దార్‌’ (Sardar), ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) వంటి చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. ఇపుడు ‘జపాన్‌’ (Japan) పేరుతో తెరకెక్కుతున్న చిత్రంలో కార్తీ నటిస్తున్నారు.

శివకుమార్‌ వారసుడిగా, సూర్య (Suriya) సోదరుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ తన ప్రతిభ, నటనతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. కార్తీ 16 యేళ్ళ సినీ కెరీర్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కార్తీయిజం’ (Karthiism) పేరుతో ఒక కామన్‌ డీపిని యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ రిలీజ్‌ చేశారు. ఇది ఇపుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. (#16YearsofKarthiism)

మరోవైపు ఆయన నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’,‘జపాన్‌’ చిత్రాలు విడుదలకానుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడితో ఆయన ఓ ద్విభాషా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. (Kollywood Hero Karthi)


ఇవి కూడా చదవండి

************************************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-25T23:28:00+05:30 IST