Srinivasa Murthy Demise: తమిళ స్టార్ హీరోల గొంతు మూగబోయింది
ABN , First Publish Date - 2023-01-27T13:33:39+05:30 IST
‘సింహాన్ని నువ్వు పేపర్లో చూసుంటావు.. టీవీలో చూసుంటావు.. సినిమాలో చూసుంటావు.. లేదా బోనులో చూసుంటావు..
‘సింహాన్ని నువ్వు పేపర్లో చూసుంటావు..
టీవీలో చూసుంటావు.. సినిమాలో చూసుంటావు..
లేదా బోనులో చూసుంటావు..
ఒంటరిగా అడవిలో నడవడం చూశావా..
కసితో జూలు విప్పి వేటాడటం చూశావా..
చాచి కొడితే ఒకటిన్నర టన్ను వెయిట్‌రా.. చూస్తావా’..
సింగంలో సినిమాలో సూర్య చెప్పే ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో సూర్య రౌద్రాన్ని మ్యాచ్ చేస్తూ వచ్చిన ఆ గొంతు అందరినీ ఆకట్టుకుంది. అలాంటి గొంతు మూగబోయింది. ఆ వాయిస్ శ్రీనివాస మూర్తి అనే డబ్బింగ్ ఆరిస్ట్‌ది. ఆయన చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన తాజాగా గుండెపోటుతో మృతి చెందారు. మొదట సింగర్ అవుదామనుకున్న ఆయన డబ్బింగ్‌లో అవకాశాలు ఎక్కువగా రావడంతో ఆ రంగంలోనే స్థిరపడిపోయారు. సూర్య, అజిత్, మోహన్‌లాల్, రాజశేఖర్, విక్రమ్, మాధవన్, అర్జున్ వంటి ఎంతోమంది హీరో, నటులకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
అపరిచితుడు సినిమాలో విక్రమ్‌కి చెప్పిన మూడు రకాల వాయిస్‌లతో శ్రీనివాస మూర్తికి మంచి పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ‘సింగం’ సినిమాలో సూర్యకి చెప్పిన డబ్బింగ్‌తో పాపులారిటీ ఇంకా పెరిగింది. అన్ని రకాల ఎమోషన్స్‌ని తన గొంతులో పలికించగలిగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆయన గుర్తింపు సాధించారు. కాగా.. శ్రీనివాస మూర్తి మృతి విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకి సంతాపం వ్యక్తం చేశారు. మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోయమని తెలుగు, తమిళ పరిశ్రమలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం పట్ల అభిమానులు, తోటి డబ్బింగ్ ఆర్టిస్టులు విచారం వ్యక్తం చేస్తున్నారు.