MS Dhoni: ‘లవ్ టుడే’ హీరోయిన్‌తో ఎమ్ఎస్. ధోనీ సినిమా
ABN , First Publish Date - 2023-01-27T16:55:57+05:30 IST
టీమిండియా క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గతేడాది అక్టోబరులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపాడు. కోలీవుడ్‌లో చిత్రాలను నిర్మించనున్నట్టు చెప్పాడు.
టీమిండియా క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) గతేడాది అక్టోబరులో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపాడు. కోలీవుడ్‌లో చిత్రాలను నిర్మించనున్నట్టు చెప్పాడు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ (Dhoni Entertainment) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేశాడు. తాజాగా కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నాడు.
ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘లెట్స్ గెట్ మ్యారిడ్’ (Let's Get Married) టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్ (Harish Kalyan), ఇవానా (Ivana) హీరో, హీరోయిన్‌గా నటించనున్నారు. రమేశ్ తమిళ మణి దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ జనవరి 27న ప్రారంభమైంది. లో బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. హరీశ్ కల్యాణ్ ‘ప్యార్, ప్రేమ, కాదల్’ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘లవ్‌టుడే’ తో ఇవానా ఈ మధ్యే బంపర్ హిట్ కొట్టింది. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ అందుకు సంబంధించిన గ్లింఫ్స్‌ను నెటిజన్స్‌తో పంచుకుంది. ‘‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి సినిమా ‘లెట్స్ గెట్ మ్యారిడ్’ ఫస్ట గ్లింఫ్స్‌ను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ఆ సంస్థ పేర్కొంది.