Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ABN , Publish Date - Dec 24 , 2023 | 04:00 PM
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి (60) మృతి చెందారు. బోండా మణి శనివారం (డిసెంబర్ 23) రాత్రి 11.30 గంటల సమయంలో పల్లవరం సమీపంలోని బొజిచలూరులోని తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బోండా మణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించారు.
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు బోండా మణి (60) మృతి చెందారు. బోండా మణి (Bonda Mani) శనివారం (డిసెంబర్ 23) రాత్రి 11.30 గంటల సమయంలో పల్లవరం సమీపంలోని బొజిచలూరులోని తన ఇంట్లో హఠాత్తుగా కుప్పకూలిపోగా.. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బోండా మణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా ధృవీకరించడంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బోండా మణి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. (Comedian Bonda Mani)
శ్రీలంకలో జన్మించిన బోండా మణి తమిళ చిత్ర పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలతో మొదలెట్టి హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. భాగ్యరాజ్ హీరోగా 1991లో వచ్చిన ‘పౌను పౌనుటన్’ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బోండా మణి.. ఆ తర్వాత ‘సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుతం, జిల్లా’.. ఇలా దాదాపు 175కి పైగా చిత్రాలలో నటించారు. స్టార్ కమెడియన్ వడివేలుతో కలిసి ఆయన చేసిన వివిధ హాస్య సన్నివేశాలు ఎందరినో అలరించాయి. (Bonda Mani No More)
వాస్తవానికి బోండా మణి హెల్త్ బాలేదంటూ ఇంతకు ముందు కూడా వార్తలు వచ్చాయి. ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవనేలా వార్తలు వస్తే.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు ఆయనకు సాయం చేశారు. ఈ మధ్య ఆయన కోలుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సడెన్‌గా ఆయన ఇలా మరణించారని తెలిసి.. అంతా దిగ్ర్భాంతికి లోనవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!
********************************
*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?
*********************************
*Ram Charan ISPL: ఐపీఎల్‌లో కాదు ఐఎస్‌పీఎల్‌లో రామ్ చరణ్‌కు టీమ్.. హైదరాబాదే!
*******************************
*RGV: ‘వ్యూహం’ బెడిసికొట్టింది.. వర్మా.. నీ కష్టం పగోడికి కూడా రాకూడదు
******************************
*Sharvari Wagh: ‘నీ పేరు ఏంటని?’ దీపికా పదుకొనే అడిగింది
********************************