RS Shivaji: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నటుడు ‘మాలోకం’ ఇక లేరు
ABN , First Publish Date - 2023-09-02T20:42:38+05:30 IST
కోలీవుడ్ నటుడు, కమెడియన్ ఆర్‌ఎస్ శివాజీ (66) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ హాస్పిటల్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన మరణ వార్తతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.
కోలీవుడ్ నటుడు, కమెడియన్ ఆర్‌ఎస్ శివాజీ (66) (RS Shivaji) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ హాస్పిటల్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆయన మరణంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. కమల్ హాసన్‌తో ఎన్నో సినిమాలలో నటించిన ఆర్‌ఎస్ శివాజీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. మరీ ముఖ్యంగా చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో కానిస్టేబుల్ మాలోకంగా నటించారు. ‘స్వర్గలోకపు అంచుల వరకు వెళ్లాను సార్’ అంటూ అందరినీ కడుపుబ్బా నవ్వించిన శివాజీ.. రీసెంట్‌గా వచ్చిన సాయిపల్లవి ‘గార్గి’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. (RS Shivaji No More)
తమిళ నిర్మాత ఎంఆర్ సంతానం కుమారుడు ఆర్‌ఎస్ శివాజీ. ఆయన సోదరుడు సంతాన భారతి కూడా కోలీవుడ్‌లో దర్శకుడిగా గుర్తింపు పొందారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 100కి పైగా సినిమాలలో నటించిన ఆర్‌ఎస్ శివాజీ.. 1981లో వచ్చిన ‘పన్నీర్ పుష్పాలు’ అనే సినిమాతో కోలీవుడ్‌లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కమల్ హాసన్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లోనే కాకుండా.. కమల్‌తో కలిసి అత్యధిక సినిమాలు నటించిన నటుడిగా ఆర్‌ఎస్ శివాజీ గుర్తింపును పొందారు.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Atiloka Sundari) చిత్రమే కాకుండా.. తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘100 అబద్దాలు’ సినిమాలోనూ శివాజీ ఓ పాత్రలో నటించారు. ఇంకా తమిళ్‌లో ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ కావడంతో.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గరయ్యారు. రీసెంట్‌గా ఆయన ‘విక్రమ్, కోలమావు కోకిల, సూరారై పొట్రు, గార్గి’ వంటి చిత్రాలలో నటించారు. శివాజీ చివరి యోగిబాబు నటించిన ‘లక్కీ మ్యాన్’. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న శివాజీ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమతో పాటు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన తెలిసిన వారంతా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ.. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఆర్‌ఎస్ శివాజీకి కమల్ హాసన్ (Kamal Haasan) నివాళి
నా స్నేహితుడు మరియు గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అయిన ఆర్.ఎస్. శివాజీ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. చిన్న పాత్రలో నటించినా.. అభిమానులకు చిరకాలం గుర్తుండేలా ప్రాణం పోసే సత్తా ఆయన సొంతం. అతను మా రాజ్‌కమల్ ఫిల్మ్స్ కుటుంబ సభ్యుడిగా ఎంతగానో గుర్తింపును పొందారు. ఆర్.ఎస్. శివాజీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.. అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
============================
*Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..
*************************************
*Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..
************************************
*Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..
*************************************
*Thrigun: పెళ్లిపీటలు ఎక్కుతోన్న మరో టాలీవుడ్ యంగ్ హీరో..
*************************************
*Pawan Kalyan: ఈ రోజుల్లో ఎవడున్నాడ్రా.. ఇలాంటోడు!
*************************************