Karthika Nair: రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లిలో సినీ ప్రముఖుల సందడి
ABN , First Publish Date - 2023-11-19T17:02:52+05:30 IST
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ పెళ్లి ఆదివారం ఉదయం రోహిత్ మేనన్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులెందరో హాజరయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. 80స్ బ్యాచ్‌కి చెందిన నటీనటులెందరో ఈ వేడుకలో సందడి చేశారు.
సీనియర్ నటి రాధ (Radha) కుమార్తె కార్తీక నాయర్ (Karthika Nair) పెళ్లి ఆదివారం ఉదయం రోహిత్ మేనన్ (Rohit Menon)తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులెందరో హాజరయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. 80స్ బ్యాచ్‌కి చెందిన నటీనటులెందరో ఈ వేడుకలో సందడి చేశారు. వారందరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాట హీరోయిన్లతో ఉన్న పిక్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో రాధ, సుహాసిని, రాధిక, రేవతి వంటి వారంతా ఉన్నారు. (Karthika Nair Weds Rohit Menon)
రాధలానే హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలని ఇండస్ట్రీలోకి.. నాగచైతన్య సరసన చేసిన ‘జోష్’ చిత్రంతో హీరోయిన్‌గా కార్తీక ఎంట్రీ ఇచ్చింది. ‘రంగం’ (Rangam) రూపంలో ఆమెకు మంచి బ్రేక్ కూడా లభించింది. అలాగే టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ‘దమ్ము’ (Dammu) సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ రావడంతో.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ (Brother of Bommali) అనే చిత్రంలో మాత్రమే కార్తీక కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె దాదాపు వెండితెరకు దూరమైంది. మరి అవకాశాలు రాలేదో.. మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. మధ్యలో ఆమెపై వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, మళ్లీ కార్తీక వెండితెర వైపు అడుగులు వేయలేదు.
మధ్యలో నిర్మాతగా ఆమె ఎంట్రీ ఇవ్వనుందనేలా కూడా వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పుడామె పెళ్లి చేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపించింది. ఎప్పుడైతే పెళ్లి అని ఫిక్స్ అయిందో.. వెంటనే ఆ దిశగా అడుగులు పడ్డాయి. తనకి ఎంగేజ్‌మెంట్ (Engagement) అయిందని రీసెంట్‌గా సోషల్ మీడియాలో షేర్ చేసిన కార్తీక.. తనకు కాబోయే వాడి ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. రీసెంట్‌గా రోహిత్ మేనన్ ఫొటోలను షేర్ చేసి.. ‘‘నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడటం ఒక మ్యాజిక్.. నీతో కలిసి నడవడానికి కౌంట్‌డౌన్ మొదలెట్టా..’’ అని కార్తీక షేర్ చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది. కార్తీక నాయర్, రోహిత్ మేనన్ పెళ్లి పీటలెక్కారు. ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్తువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
====================
*Yatra Raja: ధనుష్ పెద్ద కుమారుడికి జరిమానా.. ఎందుకంటే?
********************************
*Panja Vaishnav Tej: ‘వరుణ్‌లవ్’ వెడ్డింగ్ పార్టీలో రీతూ వర్మ.. రూమర్స్‌కు వైష్ణవ్ చెక్
****************************
*CWC23Final: మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలంటూ మీమ్స్.. ఎందుకంటే?
*******************************
*Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..
*******************************