Abhirami: అభిరామికి ఏమైంది.. వీపుపై ఆ టాటూ ఏంటి?

ABN , First Publish Date - 2023-02-23T23:45:36+05:30 IST

ఇళయ దళపతి విజయ్‌ నటిస్తున్న ‘లియో’లో నటిస్తున్న నటీమణుల్లో అభిరామి వెంకటాచలం ఒకరు. ఈమె వీపుపై

Abhirami: అభిరామికి ఏమైంది.. వీపుపై ఆ టాటూ ఏంటి?
Abhirami Venkatachalam

ఇళయ దళపతి విజయ్‌ (Vijay), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ తెరకెక్కుతోన్న ‘లియో’ (Leo)లో నటిస్తున్న నటీమణుల్లో అభిరామి వెంకటాచలం (Abhirami Venkatachalam) ఒకరు. ఈమె వీపుపై నటరాజ (Nataraja) స్వామి టాటు (Tattoo) వేయించుకుని ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకునేలా చేశారు. ఈ టాటూను చూసిన ప్రతి ఒక్కరూ అభిరామికి ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు.

abhi.jpg

మహా శివరాత్రి రోజున ఆమె కాళహస్తీశ్వరాలయానికి వెళుతూ నడిరోడ్డుపై నాట్యం చేశారు. దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇపుడు తన వీపుపై నటరాజ స్వామిని వీపుపై టాటూగా వేయించుకున్నారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె షేర్‌ చేశారు. (Abhirami Venkatachalam Tattoo)

Abhi-2.jpg

అదే సమయంలో భక్తి గురించి తనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన పనిలేదంటూ ఘాటుగా కామెంట్స్‌ చేశారు. పైగా తను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది.. తన వ్యక్తిగత విషయమంటూ ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2023-02-24T21:39:47+05:30 IST