Mansoor AliKhan: త్రిష‌తో.. బెడ్‌ సీన్ లేనందుకు ఫీల‌య్యా

ABN , First Publish Date - 2023-11-19T17:08:01+05:30 IST

నిత్యం ఏదో ఒక విష‌యంలో వివాదాల‌లో ఉండే త‌మిళ సీనియ‌ర్ న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ మ‌రోసారి వార్త‌ల్లో కెక్కాడు. ఈసారి న‌టి త్రిషపై అస‌భ్య‌క‌ర‌మైన‌ వ్యాఖ్య‌లతో దేశ వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు.

Mansoor AliKhan: త్రిష‌తో.. బెడ్‌ సీన్ లేనందుకు ఫీల‌య్యా
mansoor alikhan

నిత్యం ఏదో ఒక విష‌యంలో వివాదాల‌లో ఉండే త‌మిళ సీనియ‌ర్ న‌టుడు మ‌న్సూర్ అలీఖాన్ (Mansoor AliKhan) మ‌రోసారి వార్త‌ల్లో కెక్కాడు. ఈసారి న‌టి త్రిష (Trisha)పై అస‌భ్య‌క‌ర‌మైన‌ వ్యాఖ్య‌లతో దేశ వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఇటీవ‌ల ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ గ‌తంలో నేను చాలా సినిమాల‌లో హీరోయిన్ల‌తో బెడ్‌ సీన్ల‌లో న‌టించాన‌ని ఆ స‌మ‌యంలో నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉండేద‌ని అన్నారు.

తాజాగా ఈ మ‌ధ్య లియో (Leo) సినిమాలో న‌టించాన‌ని అందులో త్రిష‌తో బెడ్‌రూమ్‌ సీన్ ఉంటుంద‌ని అనుకున్నాన‌ని, అలాంటి సీన్ ఏమీ లేక‌పోవ‌డంతో బాధ ప‌డ్డానన్నారు. చిత్రం యూనిట్ ఆమెతో ఒక స‌న్నివేశం పెట్ట‌లేద‌ని, క‌శ్మీర్ షెడ్యూల్ అయిపోయే వ‌ర‌కు త్రిష (Trisha)ను చూసే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌న్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దేశ‌మంత‌టా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి.

ఈ వార్త‌లు త్రిష వ‌ద్ద‌కు చేర‌డంతో ఆమె స్పందిస్తూ ఇలాంటి వ్య‌క్తుల‌తో న‌టించనందుకు హ్యాపీగా ఉంద‌ని, భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న‌తో, అలాంటి వారితో న‌టించ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈ విష‌యం అంత‌కంత‌కు పెద్ద‌గా అవుతుండ‌డంతో మ‌న్సూన్ అలీఖాన్ మాట్లాడుతూ నేను ఎదో స‌ర‌దాగా మాట్లాడాన‌ని, త్రిష (Trisha) అంటే నాకు చాలా గౌర‌వం ఉంద‌ని నా మాట‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకొవద్ద‌ని తెలిపారు.


ఈ ఇష్యూపై సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవ‌డంతో మాళ‌వికా మోహ‌న‌న్ (malavika mohanan), లోకేశ్ క‌న‌గ‌రాజ్ (lokesh kanagaraj), చిన్మ‌యి శ్రీపాద‌ల‌తో ఇత‌ర‌ సినీ న‌టులు, ద‌ర్శ‌కులు తీవ్రంగా స్పందిస్తూ మ‌న్సూర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.

మ‌హిళ‌ల‌తో ఇలా మాట్లాడం మంచి ప‌ద్ద‌తి కాద‌ని, వారిపై ఇష్టానుషారంగా మాట్లాడి అగౌర‌వ ప‌ర్చ‌డం స‌హించ‌రానిదంటూ సీరియ‌స్ అవుతున్నారు. ఇలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాలన్నారు. ఇదిలా ఉండ‌గానే లియో స‌క్సెస్ మీట్‌లోనూ మ‌న్సూర్ ఇలాంటి వ్యాఖ్య‌లే చేసిన సంద‌ర్భంలో అక్క‌డ ఉన్న వారంతా విని న‌వ్వే వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

Updated Date - 2023-11-19T17:09:43+05:30 IST