Sumalatha son Marriage: ఘనంగా సుమలత కుమారుడి వివాహం!
ABN , First Publish Date - 2023-06-05T17:59:56+05:30 IST
దివంగత అంబరీష్, నటి, కర్ణాటక ఎంపీ సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ప్రముఖ ప్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది.
దివంగత అంబరీష్, నటి, కర్ణాటక ఎంపీ సుమలత (Suma latha) దంపతుల కుమారుడు అభిషేక్ (Abhishek) వివాహం సోమవారం ఘనంగా జరిగింది. ప్రముఖ ప్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాతో ఆయన పెళ్లి జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ వీరి వివాహానికి వేదికైంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రజనీకాంత్(Rajanikanth), మోహన్‌బాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.