Redin Kingsley : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన హాస్యనటుడు!
ABN , First Publish Date - 2023-12-10T17:18:00+05:30 IST
తమిళ నటుడు రెడిన్ కింగ్స్‌స్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన సంగీతను ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తమిళ నటుడు రెడిన్ కింగ్స్‌స్లీ (Redin Kingsley ) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చెన్నైకు చెందిన సంగీతను (Sangeetha) ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు అందరిని ఆకర్షిస్తున్నాయి. నెటిజన్లు, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన ‘జైలర్’ సినిమాతో దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెడిన్ కామెడీ స్టైలే వేరు. అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు.
నయనతార ప్రధాన పాత్ర పోషించిన 'కొలమావు కోకిల’ చిత్రంతో ఆయన కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు. శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ‘డాక్టర్’లోని నటనకుగాను ఆయన ఉత్తమ హాస్యనటుడిగా ‘సైమా’ అవార్డు దక్కింది. విజయ్ ‘బీస్ట్’, విజయ్ ేసతుపతి ‘కాతువాకుల రెండు కాదల్’ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌తో మరింత గుర్తింపు వచ్చింది. ఈ ఏడాది ఆయన 16 సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కంగువా, వాస్కోడగామా’ చిత్రాల్లో నటిస్తున్నారు.