Red Notice For Heros: తమిళ హీరోలపై నిర్మాతల మండలి ఫైర్!
ABN , First Publish Date - 2023-06-19T15:10:46+05:30 IST
తమిళ హీరోలకు (kollywood Heros) కోలీవుడ్ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాత హీరోలపై మండిపడుతున్నారు. ఈ మేరకు స్టార్ హీరోలైన శింబు(Simbu), విశాల్ (Vishal), అధర్వ, ఎస్‌జే సూర్య(Sj Surya), యోగిలకు రెడ్ నోటీస్ ఇచ్చినట్లు సమాచారం.
తమిళ హీరోలకు (kollywood Heros) కోలీవుడ్ నిర్మాతల మండలి షాక్ ఇచ్చింది. రెమ్యునరేషన్, అడ్వాన్సులు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాత హీరోలపై మండిపడుతున్నారు. ఈ మేరకు స్టార్ హీరోలైన శింబు(Simbu), విశాల్ (Vishal), అధర్వ, ఎస్‌జే సూర్య(Sj Surya), యోగిలకు రెడ్ నోటీస్ ఇచ్చినట్లు సమాచారం. ఇలాంటి విషయాల్లో తమిళ పరిశ్రమకు చెందిన ఏ సంఘం అయిన కాస్త సీరియస్‌గానే నిర్ణయం తీసుకుంటుంది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ వివాదంపై తమిళ నిర్మాతల మండలి (Tamil producers council) స్పందించింది. ఇటీవల జరిగిన నిర్మాతల మండలి జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు, శింబు, ఎస్‌జే సూర్య, అధర్వ, విశాల్, యోగిబాబు.. ఐదుగురు నటులకు రెడ్ నోటీస్ (Red Notice For Tamil Heros) ఇవ్వాలని నిర్ణయించింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
అయితే హీరోల వైపు నుంచి కూడా ఓ వాదన వినిపిస్తుంది. సరైన కథ లేకుండా పిచ్చి కథలతో ముందుకు వస్తే డేట్లు ఎలా ఇచ్చేది అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఆయా హీరోలతో సినిమాలు తీయడం, బహిష్కరించడం లాంటివి జరుగుతుంటాయి. ఎంతో కఠినంగా వ్యవహరించే నడిగర్ సంఘం, నిర్మాత మండలి ఈ హీరోలపై ఎలా స్పందిస్తారో చూడాలి. బహిష్కరిస్తారా లేదా ఆయా నిర్మాతలతో కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తారా అన్నది చూడాలి. ఈ ఐదుగురు నటుల తీరుపై మండి పడుతున్న నిర్మాతల మండలి ఇప్పటికే నడిగర్ సంఘం నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది.