Aparna Nair : నేను వెళ్లిపోతున్నాను పిల్లలు జాగ్రత్త’ అని రోదిస్తూ...

ABN , First Publish Date - 2023-09-02T15:02:00+05:30 IST

మలయాళ నటి అపర్ణ నాయర్‌ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని కేరళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఆగస్ట్‌ 31 రాత్రి ఏడు గంటల సమయంలో తిరువనంతపురంలోని కరమణ తలియాల్‌లో ఉండే తన ఇంట్లో అపర్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల విచారించిన పోలీసులు భర్తతో గొడవలు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

Aparna Nair :  నేను వెళ్లిపోతున్నాను పిల్లలు జాగ్రత్త’ అని రోదిస్తూ...

మలయాళ నటి అపర్ణ నాయర్‌ (Aparna nair) ఆత్మహత్యకు కుటుంబ సమస్యలే కారణమని కేరళ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశారు. ఆగస్ట్‌ 31 రాత్రి ఏడు గంటల సమయంలో తిరువనంతపురంలోని కరమణ తలియాల్‌లో ఉండే తన ఇంట్లో అపర్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల విచారించిన పోలీసులు భర్తతో గొడవలు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. భర్త అతిగా తాగడం, ఆమెను నిర్లక్ష్యం చేయడం వంటి కారణాల వల్లే అపర్ణ నాయర్‌ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవని నివేదికలో పేర్కొంది. ఇంట్లో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని అపర్ణ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు అపర్ణ తన తల్లికి వీడియో కాల్‌ చేసి ఇంట్లోని సమస్యల గురించి తెలిపి, ‘నేను వెళ్లిపోతున్నాను పిల్లలు జాగ్రత్త’ అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడియో కాల్‌ కట్‌ చేసిందని తెలిసింది. ఈ వీడియో కాల్‌ ఆగష్టు 31 సాయంత్రం 6 గంటలకు జరిగింది. అనంతరం రాత్రి 7 గంటలకు అపర్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించింది.  

1.jpg

అపర్ణ కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎప్‌ఐఆర్‌ రాశారు. ప్రస్తుతం అపర్ణ భర్త సంజిత్‌ను   విచారిస్తున్నారు.  అపర్ణ, సంజిత్‌లకు ఇది రెండో వివాహం. అపర్ణకు మొదటి వివాహం నుంచి ఒక కుమార్తె ఉండగా.. సంజిత్‌ను పెళ్లి చేసుకున్నాక ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. ఆమె వయసు మూడేళ్లు. మొదట్లో వీరి జీవితం బాగానే సాగినా భర్త అతిగా తాగడం వల్ల తరచూ గొడవలు జరిగేవి. అపర్ణ తన బంధువులకు చాలాసార్లు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని బంధువులు చెబుతున్నారు. 

Updated Date - 2023-09-02T15:02:00+05:30 IST