Eagle: రవితేజ ’ఈగల్‘.. నో డౌట్‌ సంక్రాంతి బరిలోనే ఉంటాం

ABN , First Publish Date - 2023-11-01T21:53:28+05:30 IST

ఇటీవ‌లే టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన మాస్ మ‌హారాజా ర‌వితేజ నెక్ట్స్ ఈగ‌ల్ అనే సినిమా ద్వారా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డింద‌ని సంక్రాంతికి జ‌న‌వ‌రి 13న కాకుండా రిప‌బ్లిక్ డే 26 రోజున విడుద‌ల అవుతున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. మేక‌ర్స్ స్పందించి విడుద‌ల‌పై క్లారిటీ ఇచ్చారు.

Eagle: రవితేజ ’ఈగల్‘.. నో డౌట్‌ సంక్రాంతి బరిలోనే ఉంటాం
raviteja

వ‌చ్చే సంక్రాంతికి తెలుగునాట సినిమాల జాత‌ర జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డు లేని విధంగా ఈ సంక్రాంతికి మ‌హేశ్‌బాబు గుంటూరు కారం, వెంక‌టేశ్ సైంధ‌వ్, నాగార్జున నా సామిరంగా, ర‌వితేజ ఈగ‌ల్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్‌, తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ పాన్ ఇండియా చిత్రం హ‌నుమాన్ వంటి 6 భారీ బ‌డ్జెట్ చిత్రాలు పోటీ ప‌డనున్నాయి. దీంతో అదే స‌మ‌యంలో త‌మ చిత్రాల‌ను విడుద‌ల చేయాల‌నుకున్న చాలా మంది నెల రోజుల ముందుగానే త‌మ డేట్స్ సంక్రాంతి ముందుకు, వెనుక‌కు మార్చుకున్నారు.

అయితే ఇటీవ‌లే టైగ‌ర్ నాగేశ్వ‌ర రావు సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన మాస్ మ‌హారాజా ర‌వితేజ(RaviTeja ) నెక్ట్స్ ఈగ‌ల్(Eagle) అనే సినిమా ద్వారా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్‌, న‌వ‌దీప్, మ‌ధుబాలలు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా ఘ‌ట్ట‌మ‌నేని కార్తిక్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


అయితే ఈ సినిమా కొన్ని అనివార్య కార‌ణాల‌తో వాయిదా ప‌డింద‌ని సంక్రాంతికి జ‌న‌వ‌రి 13న కాకుండా రిప‌బ్లిక్ డే 26 రోజున విడుద‌ల అవుతున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతూ సొష‌ల్‌మిడియా ఎక్స్‌లో ర‌చ్చ చేశారు. దీంతో సినిమా మేక‌ర్స్ స్పందించి విడుద‌ల‌పై క్లారిటీ ఇచ్చారు.

ఎట్టి ప‌రిస్థితులలోనూ సినిమాను వాయిదా వేసుకునేది లేద‌ని సంక్రాతి బ‌రిలో ఉంటామ‌ని స్ప‌స్టం చేశారు. ఈమేరకు రెండు రోజుల్లో అధికారికంగా టీజ‌ర్ విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Updated Date - 2023-11-02T08:15:52+05:30 IST