Rajinikanth: 'లాల్ సలాం' లో రజనీకాంత్ షూటింగ్ పూర్తి

ABN , First Publish Date - 2023-07-12T14:29:31+05:30 IST

తొందర తొందరగా షూటింగ్ పూర్తి చెయ్యడంలో రజినీకాంత్ ముందుంటారు. ఒక సినిమా వొప్పుకున్నాక ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు తన డేట్స్ ఇచ్చి ఆ సినిమాని తొందరగా పూర్తి చేసే గుణం వున్న రజినీకాంత్ 'లాల్ సలాం' లో తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేశారు.

Rajinikanth: 'లాల్ సలాం' లో రజనీకాంత్ షూటింగ్ పూర్తి
Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ (SuperStarRajinikanth) ఇంకో సినిమా షూటింగ్ పూర్తి చేశారు. తన కుమార్త్ ఐశ్వర్య రజనీకాంత్ (AiswharyaRajinikanth) దర్శకత్వం లో 'లాల్ సలాం' #LalSalaam అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ #MoideenBhai అనే పాత్ర పోషిస్తున్నారు. అతని పాత్ర షూటింగ్ ఈరోజుతో పూర్తయినట్టుగా చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా అందరూ రజనీకాంత్ తో ఫోటో తీసుకొని అతనికి వీడ్కోలు పలికారు.

ఇదిలా ఉండగా ఇందులో జీవిత రాజశేఖర్ (JeevithaRajasekhar) ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆమె రజనీకాంత్ చెల్లెలుగా వేస్తున్నారు. ఆసక్తికర అంశం ఏంటంటే చాలా సంవత్సరాల తరువాత జీవిత ఒక సినిమాలో నటించడం, అదీ ఒక తమిళ సినిమాలో. ఈ సినిమాకి జీవిత కావాలని దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ చాలా పట్టుపట్టి మరీ ఆమెచేత ఇందులో ఆ పాత్ర చేయించారు. రజినీకాంత్, జీవిత ల సన్నివేశాలు చాలా బాగుంటాయని కూడా అంటున్నారు.

lalsalaam.jpg

రజినీకాంత్ కొన్ని కొన్ని సన్నివేశాలు చూసి జీవిత తో మీరు ఎందుకు నటన ఆపేసారు, ఆపకుండా కంటిన్యూ చెయ్యాల్సింది, అంత బాగా చేస్తున్నారు అని ప్రశంసించి, నటన కంటిన్యూ చెయ్యమన్నట్టుగా కూడా చెప్పారని తెలిసింది. మామూలుగా అగ్ర నటులు అందరూ సన్నివేశం అవగానే తమ తమ వానిటీ వేనుల్లోకి వెళ్లి కూర్చుంటారు, కానీ రజనీకాంత్ అదే షూటింగ్ స్పాట్ లో పక్కనే కుర్చీ వేసుకొని, మిగతా ఆర్టిస్టులతో సంభాషిస్తూ వుంటారు అని కూడా తెలిసింది. అంత పెద్ద సూపర్ స్టార్, కానీ చాలా సామాన్యంగా, ఒద్దికగా వుంటారు అని యూనిట్ సభ్యులు చెపుతున్నారు.

ఇందులో విష్ణు విశాల్ (VishnuVishal), విక్రాంత్ (Vikranth), తంబీ రామయ్య (ThambiRamaiah), సెంథిల్ (Senthil), నిరోషా (Nirosha) ఇతర తారాగణం కాగా, భారత మాజీ క్రికెట్ టీము కెప్టెన్ కపిల్ దేవ్ (KapilDev) ఒక అతిధి పాత్రలో కనపడనున్నారని తెలిసింది.

Updated Date - 2023-07-12T14:29:31+05:30 IST