Nithya Menen: గుడ్‌బై అమ్మమ్మ..ఎంతో మిస్ అవుతున్నా!
ABN , First Publish Date - 2023-07-16T11:57:17+05:30 IST
కథానాయిక నిత్యామీనన్ (Nithya menen) ఇంట విషాదం చోటుచేసుకుంది. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయినట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు నిత్యా.
కథానాయిక నిత్యామీనన్ (Nithya menen) ఇంట విషాదం చోటుచేసుకుంది. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయినట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు నిత్యా. తన అమ్మమ్మతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుని ‘ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. గుడ్‌బై అమ్మమ్మ. నా తాతయ్య చెర్రీ మ్యాన్‌ను బాగా చూసుకుంటాను’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూసిన వారంతా నిత్యా మీనన్‌కు ధైర్యం చెబుతున్నారు. గత ఏడాది భీమ్లానాయక్ చిత్రంతో అలరించిన ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు.