MM Keeravani: నిద్రలేని రాత్రులు గడిపాం!

ABN , First Publish Date - 2023-07-24T16:56:56+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పి.వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ చిత్రం 2005 ఏప్రిల్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఇలాంటి బ్లాక్‌బస్టర్‌ విజయానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రాబోతుంది. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

MM Keeravani: నిద్రలేని రాత్రులు గడిపాం!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 9Rajanikanth) హీరోగా పి.వాసు (P VAsu)దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ (Chandramukhi) చిత్రం 2005 ఏప్రిల్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. కామెడీ, ఎమోషన్స్‌, హారర్‌.. ఇలా అన్నింటి మేళవింపుగా వచ్చిన చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసింది. హారర్‌ చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇలాంటి బ్లాక్‌బస్టర్‌ విజయానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ 9Chandramukhi 2)రాబోతుంది. రాఘవ లారెన్స్‌(Raghva lawrence), కంగనా రనౌత్‌(Kangana ranaut) కీలక పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఇటీవల లారెన్స్‌ డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజాగా ఈ చిత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు.

‘‘చంద్రముఖి 2’ సినిమా చూశాను. సినిమాలోని పాత్రలకు మరణ భయంతో కంటిమీద కునుకు లేకుండా పోయింది. నా పరిస్థితి కూడా అంతే! ఈ చిత్రానికి అద్భుతమైన సన్నివేశాలకు సంగీతంతో ప్రాణం పోసేందుకు రెండు నెలలుగా నిద్రలేని రాత్రులు గడిపా. గురు కిరణ్‌, నా స్నేహితుడు విద్యాసాగర్‌ నాకు విజయం వరించాలని కోరుకోండి’ అని ట్వీట్‌ చేశారు. పి.వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆర్‌.డి రాజశేఖర్‌ ఛాయగ్రాకుడిగా పని చేస్తున్నారు. వడివేలు, మహిమా నంబియార్‌, లక్ష్మీమీనన్‌ ఇతర పాత్రల్లో కనిపిస్తారు. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పె సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వినాయక చవితికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2023-07-24T16:56:56+05:30 IST