Aadujeevitham: ఈ సినిమా కోసం చిరంజీవికి నో చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ట్రైలర్‌ను వీక్షించారా..?
ABN , First Publish Date - 2023-04-08T19:16:29+05:30 IST
కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్ ఇండస్ట్రీ. లో బడ్జెట్‌తో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. కమర్షియల్ మూవీస్ చేస్తూనే సరైన పాత్ర పడితే తమేంటో నిరూపించుకుంటుంటారు. ఇటువంటి వారిలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ముందు వరుసలో ఉంటుంటారు.
కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మాలీవుడ్ ఇండస్ట్రీ. లో బడ్జెట్‌తో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తుంటారు. కమర్షియల్ మూవీస్ చేస్తూనే సరైన పాత్ర పడితే తమేంటో నిరూపించుకుంటుంటారు. ఇటువంటి వారిలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ముందు వరుసలో ఉంటుంటారు. ఆయన తాజాగా నటించిన మూవీ ‘ఆడుజీవితం’ (Aadujeevitham). ఇంగ్లిష్‌లో ‘ది గోట్ లైఫ్ (The Goat Life) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేషనల్ అవార్డు విన్నర్ బ్లెస్సీ (Blessy) దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఏకంగా దాదాపుగా 15ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. ‘ఆడుజీవితం’ చిత్రీకరణ కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. చిత్రాన్ని 2024లో రిలీజ్ చేస్తామని తెలిపారు.
‘ఆడుజీవితం’ ట్రైలర్‌ను పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.‘‘ఆడు జీవితం ట్రైలర్‌ను అనుకోకుండా విడుదల చేశాం. అంత మాత్రాన ఆన్‌లైన్‌లో లీక్ అయిందని భావించకండి. ఆడుజీవితం, ది గోట్‌లైఫ్ చిత్రీకరణ కొంత మాత్రమే మిగిలి ఉంది. మీరు వీక్షించిన ట్రైలర్ నచ్చిందని ఆశిస్తున్నాను’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. ‘ఆడుజీవితం’ అంతర్జాతీయ ప్రమణాలతో తెరకెక్కిందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ దాదాపుగా మూడు నిమిషాలకు పైనే ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తన నటనతో కట్టిపడేశారు. బానిస బతుకు అనుభవిస్తున్నఆయన వలస కూలీగా ఎందుకు జీవించారు..? ఎడారిలో ఆహారం దొరక్క బక్క చిక్కిపోయిన వ్యక్తిగా ఆయన కనిపించారు.
‘ఆడుజీవితం’ ను జోర్డాన్, సహారా, అల్జీరియా ఎడారుల్లో షూట్ చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో మూవీ టీమ్ జోర్డాన్‌లో 70 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో చిరంజీవి హీరోగా చేసిన ‘సైరా’ లో ఓ రోల్ కోసం పృథ్వీరాజ్‌ను సంప్రదించారు. ఈ సినిమా కోసం విదేశాల్లో ఉండటంతో ఆ పాత్రకు ఆయన నో చెప్పారు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?
Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!
Salman Khan: యంగ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్
Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా
Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..