Renjusha Menon: మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టి ఆత్మ‌హ‌త్య‌

ABN , First Publish Date - 2023-10-30T17:58:49+05:30 IST

మ‌ళ‌యాళ చిత్రసీమ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీరియ‌ల్, సినిమా న‌టి రెంజూషా మీన‌న్ ఊరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

Renjusha Menon: మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టి ఆత్మ‌హ‌త్య‌
renjusha

మ‌ళ‌యాళ(Malayalam) చిత్రసీమ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సీరియ‌ల్, సినిమా న‌టి రెంజూషా మీన‌న్ (Renjusha Menon, 35) ఊరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించింది. వివ‌రాల్లోకి వెళితే టీవీ యాంకర్‌గా ఇండ‌స్టీలోకి అడుగుపెట్టిన రెంజుషా అన‌తి కాలంలోనే 'స్త్రీ' అనే సీరియ‌ల్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై క్యారెక్ట‌ర్ న‌టిగా సినిమాలు చేస్తూ న‌టుడు మ‌నోజ్‌ను వివాహం చేసుకుని అత‌నితో క‌లిసి తిరువ‌నంత‌పురంలో ఓ ఆపార్ట్మెంట్‌లో అద్దెకు నివ‌సిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె కొన్ని సీరియ‌ల్స్ కూడా నిర్మించింది.

menon.jpg

అయితే సోమ‌వారం ఉద‌యం ఆమె కుటుంబ‌స‌భ్యులు రెంజూషా ఇంటికి రాగా చాలా సేపు తాళం వేసి ఉండ‌డాన్ని గ‌మ‌నించి అనుమానంతో త‌లుపులు ప‌గుల గొట్టి చూడ‌గా ఓ గ‌దిలో ఊరేసుకుని చ‌నిపోయి క‌నిపించింది. వారు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా వారు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కాగా తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల‌తోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.


స్వ‌త‌హాగా భ‌ర‌త నాట్యం డ్యాన్స‌ర్ అయిన అమెకు మేరిక్కుండోరు కుంజాడు', 'బాంబే మార్చ్', 'కార్యస్థాన్', 'వన్ వే టిక్కెట్', 'అద్భుత ద్వీపు, వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే అమె మ‌ర‌ణానికి ముందు తోటి న‌టి అనీల్ శ్రీదేవి రెంజుషాతో క‌లిసి చేసిన ఫ‌న్నీ ఇన్‌స్టా రీల్ వీడియో పోస్టు చేసిన కాసేప‌టికే ఆత్మ‌హ‌త్య చేసుకుని మ‌ర‌ణించ‌డం యాదృశ్చికంగా జ‌రుగ‌గా నెటిజ‌న్లు ఆ వీడియోను చూసి రెస్ట్ ఇన్ పీస్ అనే కామెంట్లు పెడుతున్నారు. అయితే గ‌త నెల‌లోనే ఆప‌ర్ణ నాయ‌ర్ అనే యువ న‌టి ఆత్మ‌హత్య చేసుకోగా ఇప్పుడు రెంజూషా మీనన్‌ది రెండ‌వది.

Updated Date - 2023-10-30T18:04:17+05:30 IST