'Sesham Mikeil Fathima: ఓటీటీలోకి.. మళయాళ డబ్బింగ్ కామెడీ, స్పోర్ట్స్ డ్రామా
ABN , First Publish Date - 2023-12-13T10:03:02+05:30 IST
మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.ప్రతివారం రెండు మూడు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలోకి వస్తుండగా ఈవారం మళయాళ కామెడీ చిత్రం శేషం మైక్-ఇల్ ఫాతిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాను నెల గడవక ముందే డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు.
మరో డబ్బింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.ప్రతివారం రెండు మూడు డబ్బింగ్ చిత్రాలు ఓటీటీలోకి వస్తుండగా ఈవారం మళయాళ కామెడీ చిత్రం శేషం మైక్-ఇల్ ఫాతిమా (Sesham Mikeil Fathima) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) కథానాయికగా, ఫెమినా జార్జ్ (Femina George), షాహీన్ సిద్ధిఖ్(Shaheen Siddique) ప్రధాన పాత్రల్లో నటించగా మను కుమార్ (Manu C. Kumar) దర్శకత్వం వహించారు. తెలుగులో ఖుషి,హాయ్ నాన్న, మళయాళంలో హృదయం వంటిచిత్రాలకు సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
అరుదుగా కథానాయిక ప్రధాన పాత్రగా ప్రత్యేక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో వచ్చిన ఈ చిత్రం మలయాళ నాట మంచి విజయాన్నే సాధించింది. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఆటపై ఇష్టం పెంచుకున్న ఓ ముస్లిం యువతి నూర్జహాన్ ఎలాగైనా ఇండియన్ ఫెడరేషన్ లీగ్‌లో వ్యాఖ్యాతగా ఎంపిక కావాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. కుటుంబంలో సోదరుడు మినహా కుటుంబం అడ్డు చెప్పడం, ఈ క్రమంలో తన కలను సాకారం చేసుకోవడానికి సదరు యువతి ఎదుర్కొనే అడ్డంకులు, బెదిరింపులు నేపథ్యంలో ఈ చిత్రం వినోదాత్మకంగా రూపొందిచబడింది.
ఇటీవల మళయాలంలో 'తల్లుమాల', 'బ్రో డాడీ' చిత్రాల్లో తన మేనరిజమ్స్‌తో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రంలో ఫాతిమా నూర్జహాన్ పాత్రకు ప్రాణం పోషింది. గతంలో చిత్రలహరి, హలో, వంటి మూడు నాలుగు సినిమాలతో తెలుగు వారికి పరిచయమే. అయితే కథాంశం బలహీనంగా ఉండడం ఈ సినిమాకు మైనస్‌గా నిలిచింది. కాగా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈచిత్రాన్ని నెల గడవక ముందే డిసెంబర్ 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తున్నారు.