Dulquer Salmaan: ఆ కారణం వల్లనే సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఆలస్యం
ABN , First Publish Date - 2023-03-24T17:47:27+05:30 IST
మమ్ముట్టి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). భాషలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు. ‘మహానటి’ (Mahanati), ‘సీతారామం’ (Sita Ramam) వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
మమ్ముట్టి కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). భాషలకు అతీతంగా ఆయనకు అభిమానులున్నారు. ‘మహానటి’ (Mahanati), ‘సీతారామం’ (Sita Ramam) వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తనకు అనేక మూవీ ఆఫర్స్ వచ్చినప్పటికీ తాను ఆలస్యంగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని దుల్కర్ సల్మాన్ తెలిపారు.
‘‘సినీ ఇండస్ట్రీలో మా నాన్న పేరును చెడగొడుతాననే భయం నాకు ఉండేది. నటించగలనని నేను ఎప్పుడు అనుకోలేదు. వెండి తెరపై నేను కనిపిస్తే రెండు గంటల పాటు చూస్తారా అని ఆలోచించాను. 20ఏళ్ల వయసులో మనకు అనేక భయాలు ఉంటాయి. మన మీద మనకు ఆత్మ విశ్వాసం ఉండదు. నా విషయంలోను ఇదే సీన్. అదే సమయంలో మలయాళం ఇండస్ట్రీలో నెపోటిజం బాగా చర్చనీయాంశమైన విషయం. మా నాన్న ఈ రంగంలో లెజెండ్. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన పేరును నేను చెడగొడతానేమోనని భయపడ్డాను. అందువల్లే స్టార్ హీరోల పిల్లలు 20ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇస్తున్నప్పటికీ, నేను 28ఏళ్లకు వెండితెర పైకి రంగప్రవేశం చేశాను’’ అని దుల్కర్ సల్మాన్ తెలిపారు.
దుల్కర్ ప్రస్తుతం ‘కింగ్ ఆఫ్ కోతా’ (King of Kotha) లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతుంది. దుల్కర్ సొంత నిర్మాణ సంస్థతో కలసి జీ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఈ చిత్రం ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు.