Breaking: మలయాళ వెటరన్ యాక్టర్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
ABN , First Publish Date - 2023-03-27T08:40:09+05:30 IST
మలయాళ వెటరన్ యాక్టర్, లోక్‌సభ మాజీ సభ్యులు ఇన్నోసెంట్ (ఇన్నోసెంట్) ఆదివారం కన్నుమూశారు.
మలయాళ వెటరన్ యాక్టర్, లోక్‌సభ మాజీ సభ్యులు ఇన్నోసెంట్ (Innocent) ఆదివారం కన్నుమూశారు. 75 ఏళ్ల ఇన్నోసెంట్ కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఊపితిత్తుల సమస్యతో బాధ పడడంతో పాటు అవయవాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో మార్చి 3న ఆయన్ని కొచ్చిలోని వీపిఎస్ లకేషోర్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ తరుణంలోనే ఆదివారం (మార్చి 26న) గుండెపోటు రావడంతో ఇన్నోసెంట్ మరణించినట్లు హాస్పిటల్ మేనేజ్‌మేంట్ హెల్త్‌బులిటెన్‌తో తెలియజేసింది.
ఇన్నోసెంట్ మృతి విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఆయన సంతాపం తెలియజేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Kerala Chief Minister Pinarayi Vijayan), కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లతో పాటు మోహన్‌లాల్ (Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్, ఖుష్బు వంటి ప్రముఖులు అందులో ఉన్నారు.
అయితే.. 1972లో విడుదలైన నృత్యశాల మూవీ ద్వారా ఆయన సినీ కెరీర్ మొదలైంది. సహాయక పాత్రలు చేస్తూనే.. విలన్‌గా, కమెడియన్‌గా కూడా ఎన్నో చిత్రాలు చేసి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఐదు దశాబ్దాల కొనసాగిన ఆయన సినీ కెరీర్‌లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఇన్నోసెంట్ యాక్ట్ చేసిన సినిమాల్లో.. ‘అక్కరే నిన్నోరు మారన్’, , ‘నాడోడిక్కట్టు’, ‘తూవల్‌స్పర్శమ్’, ‘గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్’, ‘సందేశం’, ‘డాక్టర్ పశుపతి’, ‘కేళి’ ‘రామోజీ రావు స్పీకింగ్’ వంటి ఎప్పటికీ మలయాళ ప్రేక్షకులు గుర్తుంచుకునే మూవీస్ చేశారు. అంతేకాకుండా.. గతేడాది పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా చేసిన ‘కడువా’ సినిమాలో నటించారు. ఆయన చివరిగా ‘పుష్ప’ ఫేమ్ ఫహద్ ఫాజిల్ హీరోగా చేసిన ‘పాచువుమ్ అత్భుథవిలక్కుమ్’లో యాక్ట్ చేశారు. ఆ చిత్రం విడుదలకి సిద్ధమవుతోంది.
అంతేకాకుండా.. 2014 ఎన్నికల్లో గెలిచి త్రిస్సూర్ చాలాకుడి నియోజవర్గం నుంచి ఎంపీగా గెలిచి లోక్‌సభకు వెళ్లారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పదిహేనేళ్లపాటు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయనకి గతంలో క్యాన్సర్ కూడా వచ్చింది. దాని నుంచి బయట పడిన ఇన్సోసెంట్ ‘లాప్టర్ ఇన్ ద క్యాన్సర్ వార్డు’ (Laughter in the Cancer Ward) అనే బుక్‌ని కూడా రాశారు.
ఇవి కూడా చదవండి:
Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..
NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..
Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..
LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?
Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..
NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్
Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా
Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..