Dr Priya: చెకప్ కోసం వెళ్లి.. 8 నెలల గర్బంతో ఉన్న నటి మృతి
ABN , First Publish Date - 2023-11-01T18:39:10+05:30 IST
మలయాళ టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్ నటులు ఆపర్ణ నాయర్, రెంజూషా మీనన్ ఆత్మహత్యలు మరువకముందే మరో నటి కరుతముతు(తెలుగులో కార్తీకదీపం) సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన డాక్టర్ ప్రియకార్డియక్ అరెస్టుతో కన్నుమూసింది.
మలయాళ టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్ నటులు(TV Actress) ఆపర్ణ నాయర్, రెంజూషా మీనన్ ఆత్మహత్యలు మరువకముందే మరో నటి డాక్టర్ ప్రియ(Dr Priya) కార్డియక్ అరెస్టుతో కన్నుమూసింది. కరుతముతు (Karuthamuthu) (తెలుగులో కార్తీకదీపం) సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన ఈ నటి పూర్తి పేరు లక్ష్మీ ప్రియ. వృత్తి రిత్యా డాక్టర్ అయిన ఆమె సీరియల్స్‌లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం సీరియల్స్‌కు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం 8 నెలల గర్భిణీ.
రొటిన్ చెకప్ నిమిత్తం నిన్న దవాఖానకు వెళ్లిన ప్రియను వైద్యులు చెకప్ చేస్తుండగానే కార్డియక్ ఆరెస్టు(Cardiac Arrest)తో మరణించింది. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కడుపులో ఉన్న 8నెలల బిడ్డను రక్షించి ఐసీయూలో ఇన్క్యూబులేటర్లో ఉంచి పరీక్షిస్తున్నారు.
ఈ విషయాన్ని తోటి నటుడు కిశోర్ సత్య ఇన్‌స్టాలో పోస్టు చేసి విచారం వ్యక్తం చేశాడు. భార్య కోసం భర్త ఆరు నెలలగా ఇంటివద్దే ఉంటూ కంటికి రెప్పలా చూసుకున్నాడని ఆయన బాధ మరొకరికి రావొద్దంటూ వేడుకున్నాడు. అయితే ఇటీవల నటుల మరణాలు వరుసగా జరుగుతుండడంతో మళయాళ(Malayalam) ఇండస్ట్రీ షాక్‌లో ఉంది.