Aparna Nair : మలయాళ నటి మరణానికి కారణం ఏంటంటే.!
ABN , First Publish Date - 2023-09-01T16:10:12+05:30 IST
మలయాళీ బుల్లితెర నటి అపర్ణా పి.నాయర్ (31) (Aparna P Nair) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు(Aparna nair Died). తిరువనంతపురంలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఉరి వేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మలయాళీ బుల్లితెర నటి అపర్ణా పి.నాయర్ (31) (Aparna P Nair) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు(Aparna nair Died). తిరువనంతపురంలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఉరి వేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అపర్ణకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అపర్ణ మరణం గురించి ఆమె సోదరి ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘నా సోదరి మరణ వార్త తెలియగానే ఇంటికి చేరుకున్నా. నేను వచ్చే సరికి మెడకు చీర చుట్టి ఫ్యాన్‌కి వేలాడుతూ ఉంది. వెంటనే ఆమెను కిందకు దింపి ఆస్పత్ని తరలించాం. అప్పటికే ఆమె మృతి చెందింది. తన మరణానికి కారణం ఏంటటనేది తెలియడం’’ అని చెప్పింది.
పోలీసులు అపర్ణా పి.నాయర్‌ది అనుమానస్పద మృతిగా పోలీసులు పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. శవ పంచనామా అనంతరం మృతికి కారణాలు తెలిేస అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. మరోవైపు కుటుంబ తగాదాల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. పలు మలయాళ సీరియల్స్‌లో అపర్ణ నటించారు. ‘చందనమాల’, ‘ఆత్మసఖి’, ‘దేవస్పర్శమ్’ వంటి సీరియళ్లలు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి. ‘మేఘతీర్థం’, ‘కల్కి’ వంటి చిత్రాల్లో ఆమె సహాయనటిగా కనిపించారు.