Malavika Mohanan: రూ.500 కోట్లు అయితే నాకేంటి?
ABN , First Publish Date - 2023-08-01T12:16:06+05:30 IST
కొందరు కథానాయికలు పారితోషికం ఎక్కువ ఇస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధపడతారు. మరికొందరైతే కథలో తమ పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా? ఫలానా పాత్ర చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పేరు వస్తుందా లేదా ఇలా ఎన్నో రకాలు ఆలోచించి అడుగేస్తారు. కొందరైతే కథ, పాత్ర, నిడివి చాలా ముఖ్యమని చెబుతుంటారు. గట్టిగా పారితోషికం అందితే గీసుకున్న గిరిని సైతం దాటేస్తుంటారు. తాను గీసుకున్న గిరి దాటనంటోంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్.
కొందరు కథానాయికలు పారితోషికం ఎక్కువ ఇస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధపడతారు. మరికొందరైతే కథలో తమ పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా? ఫలానా పాత్ర చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పేరు వస్తుందా లేదా ఇలా ఎన్నో రకాలు ఆలోచించి అడుగేస్తారు. కొందరైతే కథ, పాత్ర, నిడివి చాలా ముఖ్యమని చెబుతుంటారు. గట్టిగా పారితోషికం అందితే గీసుకున్న గిరిని సైతం దాటేస్తుంటారు. తాను గీసుకున్న గిరి దాటనంటోంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika mohanan) . కథలో తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే అంగీకరించేదే లేదంటోంది. 2013లో ‘పట్టం బోల’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. మలయాళ, కన్నడ, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమెకు చాలా ఆఫర్లు వస్తున్నా.. వాటిలో ది బెస్ట్ అనుకున్న వాటినే ఎంచుకుంటుంది. విజయ్ సరసన మాస్టర్, ధనుష్‌తో ‘మారన్’ చిత్రాల్లో నటించి పాపులర్ అయింది. ప్రస్తుతం పా రంజిత్ (Pa ranjith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తంగలాన్’ చిత్రంలో విక్రమ్ (Vikram) సరసన నటిస్తోంది.
అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘డబ్బు కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను. నేను పోషించే పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోతే అది రూ.500 కోట్ల బడ్జెట్ చిత్రమైనా దాని వైపు చూడను. అలాంటి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా నా పాత్రకు ఎలాంటి గుర్తింపు రాదు. నా వరకూ తెరపై కనిపించినంత సేపు ప్రేక్షకుల్ని అలరించాలి. ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉండాలి’’ అని చెప్పారు. తెలుగులో కూడా ఆమె కథానాయికగా అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.