Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు

ABN , First Publish Date - 2023-08-19T10:53:17+05:30 IST

‘మామన్నన్‌’ చిత్రమే తన చివరి చిత్రమని తాను తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పు లేదని, వెనుకంజ కూడా వేయడం లేదని ఆ చిత్ర హీరో ఉదయనిధి స్టాలిన్‌ మరోమారు పునరుద్ఘాటించారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మామన్నన్‌’ సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ అర్ధ శతదినోత్సవ వేడుకలను మేకర్స్ చెన్నైలో నిర్వహించారు.

Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు
Udhayanidhi Stalin

‘మామన్నన్‌’ (Maamannan) చిత్రమే తన చివరి చిత్రమని తాను తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పు లేదని, వెనుకంజ కూడా వేయడం లేదని ఆ చిత్ర హీరో ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) మరోమారు పునరుద్ఘాటించారు. మారి సెల్వరాజ్‌ (Mari Selvaraj) దర్శకత్వంలో వచ్చిన ‘మామన్నన్‌’ సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. దీంతో అర్ధ శతదినోత్సవ వేడుకలను తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఉదయనిధి, వడివేలు (Vadivelu), కీర్తి సురేష్‌, మారి సెల్వరాజ్‌, ఏఆర్‌.రెహ్మాన్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, యూనిట్‌ సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు, బయ్యర్లు తదితరులు పాల్గొన్నారు. (Maamannan 50 Days Celebrations)


ఈ సందర్భంగా ఉదయనిధి (Udhayanidhi) మాట్లాడుతూ... ‘నేను నటించిన మొదటి చిత్రం ఘన విజయం సాధించింది. అలాగే, చివరి చిత్రం ‘మామన్నన్‌’ బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహ్మాన్‌ (AR Rahman) మాట్లాడుతూ... ‘సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనే మనోవేదన గత 30 ఏళ్లుగా నా మదిలో ఉండేది. దర్శకుడు కథ చెప్పగానే మరింతగా లీనమై సంగీతం అందించా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

Maamannan.jpg

ఇంకా ఈ కార్యక్రమంలో వడివేలు, కీర్తిసురేష్‌ (Keerthy Suresh), మారి సెల్వరాజ్‌, నిర్మాణ సంస్థ రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ (Red Giant Movies) సహ నిర్మాతలు షెణ్మగమూర్తి, అర్జున్‌ దురై తదితరులు ప్రసంగించారు. వారంతా సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చారు. ఒక మంచి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు.. మరోసారి మంచి చిత్రాలను ఆశీర్వదిస్తామని నిరూపించారంటూ కొనియాడారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం

***************************************

*Bheemadevarapally Branchi: ఓటీటీలోకి వచ్చేసిన భీమదేవరపల్లి బ్రాంచి..

***************************************

*Skanda: ‘గందారబాయి’ అంటూ.. రామ్, శ్రీలీల ఓ ఊపు ఊపేశారు

***************************************

*Sampath Nandi: ‘సౌండ్ పార్టీ’.. మరో ‘జాతిరత్నాలు’ అయ్యే సినిమా..

***************************************

*Dulquer Salmaan: ప్రభాస్ ‘కల్కి’లో దుల్కర్.. చెప్పకనే చెప్పేశాడుగా..

***************************************

Updated Date - 2023-08-19T10:53:17+05:30 IST