Srinidhi Shetty: యశ్‌పై ఆరోపణలు.. స్పందించిన ‘కెజియఫ్’ హీరోయిన్..
ABN , First Publish Date - 2023-03-18T17:20:13+05:30 IST
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘కెజియఫ్’ (KGF). రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా నటించారు. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ పాత్రను పోషించారు. యశ్‌పై ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
హీరోయిన్ పాత్రను పోషించారు. యశ్‌పై ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘‘యశ్ వ్యక్తిత్వం సరిగ్గా లేని కారణంగా టాప్ దక్షిణాది, బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆయనకు గుడ్ బై చెప్పేశాయి. యశ్ ఒక్కో సినిమాకు రూ.75కోట్లను డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు అది చాలా ఎక్కువని భావిస్తున్నారు. అందువల్ల ఆయనతో చిత్రం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. గర్వంతో పాతాళానికి పాడిపోతాం యశ్’’ అని ఉమైర్ సంధు తెలిపారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చను తెరలేపింది. దీంతో ‘కెజియఫ్’ నటి శ్రీ నిధి శెట్టి ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను పెట్టారు. ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
‘‘సోషల్‌మీడియాను రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. వాడే వ్యక్తిపై అది ఆధారపడి ఉంటుంది. కొంతమంది మంచి పనుల కోసం ఉపయోగిస్తుంటే.. మరికొంతమంది మాత్రం అసత్యాలు, వదంతులను ప్రచారం చేయడానికి వాడుతున్నారు. కానీ, నేను దీన్ని మంచి కోసం వాడదల్చుకున్నాను. అందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను. ‘కెజియఫ్’ వంటి అద్భుతమైన ప్రపంచంలో యశ్‌తో కలిసి పనిచేయడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నా దృష్టిలో ఆయనొక జెంటిల్మెన్, గురువు, స్నేహితుడు, స్ఫూర్తి. యశ్.. నేను ఎప్పటికీ మీ అభిమానినే’’ అని శ్రీ నిధి శెట్టి తెలిపారు.
దుబాయ్‌లో సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా పనిచేస్తున్నంటూ ఉమైర్ సంధు ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. ట్విట్టర్‌లో కొంత కాలంగా హల్‌చల్ చేస్తున్నారు. బాలీవుడ్, దక్షిణాది సినిమాలపై కామెంట్స్ చేస్తుంటారు. గతంలోను ‘పొన్నియిన్ సెల్వన్’ విడుదలకు ముందే సినిమాపై రివ్యూ పెట్టి సుహాసినితో తిట్లు కూడా తిన్నారు.
^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!
RRR: రామ్ చరణ్, తారక్ అందువల్లే ఆస్కార్ స్టేజ్‌పై డ్యాన్స్ చేయలేదు!
Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు
Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు
Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!
Jr NTR: ధనుష్, వెట్రిమారన్ సినిమాపై తారక్ క్లారిటీ..
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?