KGF Actress: ‘కెజియఫ్’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది
ABN , First Publish Date - 2023-04-13T16:41:49+05:30 IST
‘కెజియఫ్’ సినిమాని నడిపించేది ఒక జర్నలిస్ట్ (Journalist) పాత్ర. ఆ జర్నలిస్ట్ అంటే అందరికీ భయం. ఆమె గట్టిగా మాట్లాడితే.. ఎదుట ఎలాంటి వారు ఉన్నా.. వణికిపోవాల్సిందే. అలాంటి పవర్‌ఫుల్ పాత్రలో నటించిన..
కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Rocking Star Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన ‘కెజియఫ్’ (KGF) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సునామీని క్రియేట్ చేసిందో తెలియంది కాదు. ఇందులో ఒక్కో పాత్రని ప్రశాంత్ నీల్ హైలెట్ చేసిన తీరు.. కన్నడ సినిమా పరిశ్రమను ఈ సినిమాకు ముందు, తర్వాత అనే రేంజ్‌కి చేర్చింది. అప్పటి వరకు తమిళ్, మలయాళ సినీ ఇండస్ట్రీలకే పేరుంటే.. రాజమౌళి చిత్రాలతో తెలుగు, ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్’ చిత్రంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలు ఒక్కసారిగా అగ్ర స్థానానికి చేరాయి. ముఖ్యంగా ‘కెజియఫ్’ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, దేశవ్యాప్తంగా గుర్తింపును పొంది సంచలనాన్ని సృష్టించింది.
విషయంలోకి వస్తే.. ‘కెజియఫ్’ సినిమాని నడిపించేది ఒక జర్నలిస్ట్ (Journalist) పాత్ర. ఆ జర్నలిస్ట్ అంటే అందరికీ భయం. ఆమె గట్టిగా మాట్లాడితే.. ఎదుట ఎలాంటి వారు ఉన్నా.. వణికిపోవాల్సిందే. అలాంటి పవర్‌ఫుల్ పాత్రలో నటించి.. ఆ పాత్రకే వన్నె తెచ్చిన నటి మాళవిక అవినాష్ (Malavika Avinash). కెజియఫ్ 1, 2 చిత్రాలలో ఆమె పాత్ర కనిపించేది చాలా తక్కువ సమయమే అయినప్పటికీ.. సినిమాపై ఆమె పాత్ర చూపే ప్రభావం చాలానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రలో నటించిన పవర్ ఫుల్ లేడీ, రాజకీయ నాయకురాలు మాళవిక అవినాష్ ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైయ్యారు (Malavika Avinash Hospitalized). తాజాగా ఆమె హాస్పిటిల్‌లో చికిత్స తీసుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెకి ఏం జరిగింది? అంటూ అంతా పోస్ట్‌లు చేస్తున్నారు.
ఇంతకీ మాళవిక అవినాష్ హాస్పిటల్‌లో జాయిన్ అవడానికి కారణం మైగ్రేన్. గత కొన్నాళ్లుగా ఆమె మైగ్రేన్‌తో బాధపడుతున్నారట. ఈ విషయం స్వయంగా ఆమెనే తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ‘‘ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే మాత్రం.. ఏముందిలే తలనొప్పి అని తేలికగా తీసుకోవద్దు. అలా తీసుకుంటే నాలాగా హాస్పిటల్ పాలవుతారు. ఈ మైగ్రేన్ (Migraine) సమస్య నుంచి బయటపడేందుకు ప్రస్తుతం పనాడోల్, నెప్రోసిమ్‌తో పాటు సంప్రదాయ ఔషధం తీసుకుంటున్నాను. మైగ్రేన్ సమస్య ఉన్న వారు కచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించంది’’ అని మాళవిక అవినాష్ తన పోస్ట్‌లో తెలుపుతూ.. హాస్పిటల్‌లో బెడ్‌పై ఉన్న పిక్‌ని షేర్ చేశారు. ఈ పిక్‌లో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై.. త్వరగా మీరు కోలుకుని ‘కెజియఫ్ 3’ (KGF 3) కథని మాకు చెప్పాలంటూ నెటిజన్లు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?
*Brahmaji: ట్రైలర్ బాగుందా? అని అడిగిన సంయుక్తకు షాకింగ్ రిప్లయ్
*NTR 30: కొరటాల స్పీడ్ చూశారా.. అప్పుడే ఒకటి ఫినిష్..!
*Allu Arjun: సూపర్ హిట్ సినిమా మిస్సయిన అల్లు అర్జున్.. ఏ సినిమానో తెలిస్తే షాకవుతారు
*Direct OTT Release: ఈ వారం రెండు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి..