Malavika Avinash: ఇతరులకు అసభ్య కాల్స్, మెసేజ్‌లు.. చిక్కుల్లో కేజీయఫ్ నటి
ABN , First Publish Date - 2023-11-05T21:54:24+05:30 IST
ప్రముఖ కన్నడ నటి, కర్ణాటక బీజేపీ నాయకురాలు మాళవిక అవినాష్ సమస్యల్లో చిక్కుకుంది. ఇతరులకు ఫోన్ చేసి బెదిరించినందుకు, అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులు పెడుతున్నదంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ(ట్రాయ్) ఆమె సిమ్‌ను డియాక్టివేట్ చేసింది. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ప్రముఖ కన్నడ నటి, కర్ణాటక బీజేపీ నాయకురాలు మాళవిక అవినాష్(Malavika Avinash) సమస్యల్లో చిక్కుకుంది. ఇతరులకు ఫోన్ చేసి బెదిరించినందుకు, అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ ఇబ్బందులు పెడుతున్నదంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సంస్థ(ట్రాయ్) ఆమె సిమ్‌ను డియాక్టివేట్ చేసింది. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఈ విషయమై ముంబయ్ పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఆమెను ఆరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే..
మాళవికా అవినాష్ మూడున్నర దశాబ్దాలుగా కన్నడ, తమిళ సినిమాలలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించింది. కేజీఎఫ్ చాఫ్టర్ 1,2లలో జర్నలిస్టు పాత్రతో ఆమె దేశ వ్యాప్తంగా మరింత పేరు గడించింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి రాష్ట్ర బీజేపీ స్పోక్స్ పర్సన్‌గా కూడా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా కొంతమంది సైబర్ నేరగాళ్లు ముంబయ్‌లో మాళవికా ఆధార్ కార్డును ఉపయోగించి సిమ్ కార్డ్స్ తీసుకుని ఇతరులకు అసభ్యకర మేసేజ్‌లు పెడుతూ ఫొన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మాళవిక ప్రమేయం లేకుండానే ఆమెపై కేసులు కూడా నమోదైనట్లు తెలిసింది.
దీంతో ట్రాయ్(TRAI) అధికారులు మాళవికాకు ఫొన్ చేసి రెండు గంటల్లో మీ సిమ్‌లు డియాక్టివేట్ అయితాయని చెప్పి కొన్ని సూచనలు చేశారు. దీంతో షాకైన ఆమె ఈ విషయమై ఎంక్వైరీ చేయగా తన పేరు మీద తీసుకున్న సిమ్‌లతో మిస్ యూస్ చేస్తున్నారని తెలుసుకుంది. వెంటనే ముంబయ్ పొలీసులను ఫోన్‌లో సంప్రదించగా వారు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పారు. అయితే నేను అక్కడికి రాలేనని తెలిపి స్కైప్‌లో వీడియో కాల్ ద్వారా తన స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ సైబర్ నేరాల విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.