Puneeth Rajkumar: ఓటీటీలోకి వచ్చేసిన పవర్ స్టార్ చివరి చిత్రం ‘గంధద గుడి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ABN , First Publish Date - 2023-03-17T14:19:18+05:30 IST
టాలీవుడ్‌తో పాటు మలయాళ, తమిళ పరిశ్రమల్లో మంచి పాపులారిటీ ఉన్న కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar).
టాలీవుడ్‌తో పాటు మలయాళ, తమిళ పరిశ్రమల్లో మంచి పాపులారిటీ ఉన్న కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar). ఈ నటుడిని కన్నడ (Kannada)లో పవర్ స్టార్ అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పునీత్ వ్యక్తిత్వానికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అవసరమైన వారికి సాయం చేస్తూ, ఆపదలో ఆదుకునే వ్యక్తిగా ఈ నటుడికి మంచి పేరుంది. అలాగే.. దాదాపు 1700 పిల్లలను చదివించారు. అయితే.. రెండేళ్ల క్రితం గుండెపోటుతో ఆయన మరణించడంతో కన్నడ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది అభిమానులు అంత్యక్రియలకి ముందు ఆయన పార్థివదేహాన్ని చూడటానికి తండోపతండాలుగా తరలివచ్చారు. అలాగే.. కర్నాటక ప్రభుత్వం పునీత్‌ని కర్నాటక రత్న బిరుదుతో సత్కరించింది. (Karnataka Government)
అయితే.. ఆయన మరణించేనాటికి కొన్ని సినిమాలు మధ్యలో ఉన్నాయి. వాటిలో దాదాపు అన్నింటిని ఇప్పటికే ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. కాగా.. ఆయన చివరి చిత్రం ‘గంధద గుడి’ (Gandhada Gudi) తాజాగా ఓటీటీలో విడుదలైంది. నిజానికి ఇదో డాక్యుమెంటరీ చిత్రం. అమెగావర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పునీత్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. గతేడాది థియేటర్స్‌లో విడుదలైన ఈ డాక్యుమెంటరీ డ్రామా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. కొందరూ అభిమానులైతే ఈ చిత్రాన్ని రెండు అంతకంటే ఎక్కువసార్లు చూశారు. అలాగే.. వారితో పాటు ఈ మూవీని థియేటర్స్‌లో చూడలేకపోయిన పునీత్ ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
కాగా.. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని పునీత్ 48వ జయంతి సందర్భంగా నేటి (మార్చి 17) నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆ ఓటీటీ యాజమాన్యం తాజాగా ప్రకటించింది. ‘బయటి ప్రపంచంలో గొప్ప అద్భుతాలను కనుగొని, విస్మయం కలిగించే ప్రకృతిలోకి ప్రయాణించండి’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ చిత్రంలో కర్నాటకకి చెందిన అడవుల అందాలను చాలా అద్భుతంగా చూపించారు.
ఇవి కూడా చదవండి:
Rana: ఎన్టీఆర్ నుంచి అది దొంగతనం చేయాలి.. అనుకుంటే 20 నిమిషాల్లోనే..
Kabzaa Twitter Review: కన్నడ నుంచి మరో ‘కేజీఎఫ్’?.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’
#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్
OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ
Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..