Biggboss : బిగ్‌బాస్‌ హౌస్‌లో అరెస్ట్‌ సంచలనం!

ABN , First Publish Date - 2023-10-24T16:16:56+05:30 IST

పాపులర్‌ టీవీ షో బిగ్‌బాస్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కన్నడలో జరుగుతున్న బిగ్‌బాస్‌ 10లో ఇంటి సభ్యుడిగా ఉన్న వర్తుర్‌ సంతోష్‌ అరెస్ట్‌ కావడం సంచలనం సృష్టించింది. హౌస్‌ లోపలికి వెళ్లి మరీ అటవీశాఖ అధికారులు సంతోష్‌ను అరెస్ట్‌ చేశారు.

Biggboss : బిగ్‌బాస్‌ హౌస్‌లో అరెస్ట్‌ సంచలనం!

పాపులర్‌ టీవీ షో బిగ్‌బాస్‌లో (biggboss 10) అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కన్నడలో జరుగుతున్న బిగ్‌బాస్‌ 10లో ఇంటి సభ్యుడిగా ఉన్న వర్తుర్‌ సంతోష్‌(varthur Santhosh) అరెస్ట్‌ కావడం సంచలనం సృష్టించింది. హౌస్‌ లోపలికి వెళ్లి మరీ అటవీశాఖ అధికారులు సంతోష్‌ను అరెస్ట్‌ చేశారు. పులిగోరు ధరించి ‘బిగ్‌బాస్‌’లో పాల్గొనడంపై సంతోష్‌పై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు వర్తుర్‌ సంతోష్‌ను అరెస్ట్‌ చేశారు. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లి మరీ సతీష్‌ను అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినట్టు వర్తుర్‌ సంతోష్‌పై కేసు నమోదు కాగా.. బిగ్‌బాస్‌ నిర్వాహకులు సతీష్‌ను అప్పగించడానికి మొదట అంగీకరించలేదు. తదుపరి అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అరెస్ట్‌ చేేసందుకు అనుమతించినట్లు సమాచారం. బిగ్‌బాస్‌ షో హిస్టరీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పులిగోరును కొనుగోరుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం సంతోష్‌ను న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామని బెంగుళూరు ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ రవీంద్ర తెలిపారు.

Updated Date - 2023-10-24T16:16:56+05:30 IST