Vikram - Rolex: అందుకే అంత చేరువైంది... రోలెక్స్‌కు ముద్దులు!
ABN , First Publish Date - 2023-04-01T18:39:07+05:30 IST
విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రోలెక్స్‌గా సూర్య ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా యాక్ట్ చేశారు.

విక్రమ్ (Vikram) సినిమాలో రోలెక్స్ (Rolex) పాత్ర ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే! కమల్ హాసన్ (kamal haasan) హీరోగా నటించిన ఈ చిత్రంలో రోలెక్స్‌గా సూర్య ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా యాక్ట్ చేశారు. ఈ విషయం గురించి కమల్ తాజాగా మాట్లాడారు. చెన్నైలో జరిగిన ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న కమల్‌హాసన్.. సూర్యకు ఓ కేటగిరీలో అవార్డు అందించారు(Kamal Haasan kiss to Suriya) . ‘విక్రమ్ - రోలెక్స్‌ను ఒకే స్టేజ్‌పై సందడి చేశారు. ఇద్దరినీ ఒకే వేదికపై చూడడం చాలా ఆనందంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ‘మా సినిమాకు రోలెక్స్ పాత్ర కీలకం. ఆ పాత్ర వల్ల సినిమా మరెంతో మందికి రీచ్ అయింది. ఇది మేం చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం. ఒక్క ఫోన్‌కాల్ చేసిన వెంటనే సూర్య ఈ పాత్ర చేయడానికి ఓకే అన్నాడు. ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే అంగీకరించిన సూర్యకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే’’ అని అన్నారు. అనంతరం సూర్యని హత్తుకుని ఆయన నుదిటిపై కమల్ ముద్దుపెట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదే వేదికపై ఉన్న దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూర్యతో సినిమా చేయడంపై క్లారిటీ ఇచ్చారు. సూర్యతో ఓ సినిమా కమిట్‌మెంట్ ఉందని చెప్పారు. త్వరలో ఆ ప్రాజెక్ట్ మొదలుపెడతామని చెప్పారు.
‘‘సూర్యతో ప్రాజెక్ట్ చేయాలని నాకూ ఎంతో కోరికగా ఉంది. తప్పకుండా చేస్తా. 150 రోజుల్లోనే ఆ సినిమా పూర్తి చేస్తా’’ అని అన్నారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ (lokesh kanagaraj) విజయ్‌తో ‘లియో’ (leo) సినిమా చేస్తున్నారు. కమల్‌హాసన్ ప్రస్తుతం భారతీయుడు-2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇందులో కాజల్, రకుల్ కథానాయికలు. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.