Rajinikanth: జపాన్‌ రాయబారి రజనీకోసం ఏం చేశాడంటే!

ABN , First Publish Date - 2023-08-12T18:26:56+05:30 IST

తలైవా రజినీకాంత్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆయన ఆయన నడక నుంచి నవ్వు వరకూ ప్రతీది స్టైల్‌గానే ఉంటుంది. ఆయన నటనకే కాదు.. స్టైల్‌కి ప్రపంచం నలుమూలల తలైవాకు అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అబినందనలు తెలుపుతూ భారత్‌లోని జపాన్‌ రాయబారి హిరోషీ సుజుకి రజనీ స్టైల్‌ను అనుసరిస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Rajinikanth: జపాన్‌ రాయబారి రజనీకోసం ఏం చేశాడంటే!

తలైవా రజినీకాంత్‌ (Rajinikanth) స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆయన ఆయన నడక నుంచి నవ్వు వరకూ ప్రతీది స్టైల్‌గానే ఉంటుంది. ఆయన నటనకే కాదు.. స్టైల్‌కి ప్రపంచం నలుమూలల తలైవాకు అభిమానులున్నారు. తాజాగా ఆయన నటించిన ‘జైలర్‌’ (jailer) చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు అబినందనలు తెలుపుతూ భారత్‌లోని జపాన్‌ రాయబారి హిరోషీ సుజుకి (hiroshi Suzuki) రజనీ స్టైల్‌ను అనుసరిస్తూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రజనీ స్టైల్‌లో కళ్లజోడు తిప్పేందుకు సుజుకి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఓ వ్యక్తి దగ్గర తలైవా స్టైల్లో కళ్లజోడును ఎలా తిప్పాలో నేర్చుకున్నారు. అనంతరం సుజుకి రజనీ స్టైల్‌లో కళ్లజోడు పెట్టుకుని.. ‘రజనీ మీరు సూపర్‌. ‘జైలర్‌’ గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అంటే విషెస్‌ చెప్పారు. జపాన్‌లో రజనీని అమితంగా ప్రేమించేవారు ఉన్నారని ఆయన అన్నారు. సుజుకి పోస్ట్‌ చేసిన వీడియో చూసిన ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Japanese ambassador to India)

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ నెల 10న విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో నడుస్తోంది.

Updated Date - 2023-08-12T18:33:48+05:30 IST