KamalHaasan: 35 ఏళ్ల తర్వాత.. కమల్‌హసన్, మణిరత్నం సెన్సేషనల్ కాంబో స్టార్ట్
ABN , First Publish Date - 2023-10-27T16:17:18+05:30 IST
సినీ అభిమానులకు ఇది నిజంగా సూపర్ వార్త. ఎన్నాళ్ల నుంచో సౌత్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న అద్భుతమైన కాంబినేషన్ ఎట్టకేలకు ముందుకు వచ్చింది. 1987లో నాయకన్ (నాయకుడు) సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా సెన్షేషన్ క్రియేట్ చేసిన కమల్‌హసన్(Kamal Haasan), మణిరత్నం(Mani Ratnam) జంట మళ్లీ 35 సంవత్సరాల తర్వాత కలిసి సినిమా చేయనున్నారు. కమల్‌హసన్ #KH234 గా వస్తున్న ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం) అధికారికంగా ప్రకటించి ప్రోమో విడుదల చేశారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్ , శివ అనంత్ సంయిక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అస్కార్ గ్రహీత AR రెహమాన్(AR Rahman) సంగీతం అందించనుండగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. విక్రమ్ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన అన్బరీవ్, మణిరత్నంతో కన్నతిల్ ముత్తమిట్టల్(అమృత), అయుత ఎళుతు (యువ) చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఈ చిత్రానికి పని చేయనున్నారు.
కమల్‌హసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రూపుదిద్దుకుని 1987 ఆక్టోబర్‌లో విడుదలైన నాయకన్ (Nayakan) (నాయకుడు)కు భారతదేశ సినిమా చరిత్రలో క్లాసిక్ కల్ట్‌గా పేరుంది. ఈ సినిమాకు గాను కమల్‌హసన్ మొదటిసారి నేషనల్ అవార్డు దక్కించుకోగా, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ విభాగాల్లోను జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నది. 80, 90లలో వారికి ఈ చిత్రం గురించి బాగా తెలిసి ఉంటుంది. అప్పట్లో ఈ సినిమా గురించి తెలియని వారు జరుగని చర్చ అంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ సంవత్సరం మన దేశం నుంచి ఆస్కార్స్‌కు అఫీసియల్ ఎంట్రీగా నాయకన్ సినిమానే. అదేవిధంగా టైమ్స్ ఆల్‌టైమ్ బెస్ట్ 100 మూవీస్ లిస్టులోనూ చోటు సంపాదించింది.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ కావడం వారికి రెహమాన్(AR Rahman) జత కలవడంతో సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ అభిమానులు తెగ సంబుర పడుతున్నారు. 2024లో విడుదల కానున్న ఈ సినిమాలో నయనతార, జయం రవితో పాటు షారుఖ్ ఖాన్ గానీ తమిళ స్టార్ అజిత్ చిన్న రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.