Actress Sneha : 20 ఏళ్ల తర్వాత జోడీగా..?

ABN , First Publish Date - 2023-09-05T10:18:22+05:30 IST

నటి స్నేహకు(Sneha) గోల్డెన్‌ ఆఫర్‌ దక్కిందని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. 20 ఏళ్ల తర్వాత విజయ్‌తో (Vijay) జోడీ కట్టబోతోందని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది. తాజాగా ‘లియో’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న విజయ్‌ తన 68వ చిత్రం ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.

Actress Sneha : 20 ఏళ్ల తర్వాత జోడీగా..?

నటి స్నేహకు(Sneha) గోల్డెన్‌ ఆఫర్‌ దక్కిందని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. 20 ఏళ్ల తర్వాత విజయ్‌తో (Vijay) జోడీ కట్టబోతోందని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది. తాజాగా ‘లియో’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న విజయ్‌ తన 68వ చిత్రం ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. వెంకట ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో విజయ్‌ తండ్రీ కొడుకులుగా డ్యూయల్‌ రోల్‌ చేయబోతున్నట్లు సమాచారం. కొడుకు పాత్రకు జోడీగా ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేశారు. తండ్రి పాత్రకు విజయ్‌ సరసన హీరోయిన్‌ గురించి ఇప్పుడు వేట మొదలైంది. తొలుత ఈ పాత్రకు సూర్య భార్య జ్యోతికను అనుకున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత ఆమె అంగీకరించలేదని తెలిసింది. సిమ్రన్‌ను ప్రయత్నించారు. ఆమె కూడా వర్కవుట్‌ కాలేదు. దాంతో తాజాగా స్నేహ పేరు ప్రచారంలోకి వచ్చింది. విజయ్‌, స్నేహ కలిసి 20 ఏళ్ల క్రితం ‘ వశీకర’ చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చిందని గాసిప్పులొస్తున్నాయి.

Sneha.jpeg

ప్రస్తుతం స్నేహ, తెలుగు, తమిళ బాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది. మరి ఈ చిత్రంలో ఓల్డ్‌ విజయ్‌కు భార్య అంగీకరిస్తుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. కోలీవుడ్‌ సమాచారం మేరకు స్నేహ అంగీకరించిందనే చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు లండన్‌లో జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. సిద్థమవుతున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. యువన్‌ శంకర్‌ రాజా స్వరకర్త.

Updated Date - 2023-09-05T10:35:43+05:30 IST