2018: వందకోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే...

ABN , First Publish Date - 2023-05-30T13:12:07+05:30 IST

మలయాళంలో అఖండ విజయం సాధించి సుమారు రూ.150 కోట్లకు పైగా వసూల్ చేసిన సినిమా 2018. ఇది తెలుగులో కూడా ఈమధ్యనే విడుదల అయింది. ఈ సినిమాని ఇప్పుడు ఓటిటి లో చూసుకోవచ్చు.

2018: వందకోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే...
A still from 2018 Film

జూడ్ ఆంథోనీ జోసెఫ్ (Jude Anthany Joseph) దర్శకత్వంలో వచ్చిన ఈ '2018' 2018OTTRelease సినిమా మలయాళంలో చాలా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల వర్షం కురిపించి, సుమారు రూ 150 కోట్ల రూపాయలవరకు ఒక్క మళయాళంలోనే కలెక్టు చేసింది. ఇందులో టీవోనీ థామస్ (Tovino Thomas), కుంచాకో బాబన్ (Kunchacko Boban), అసిఫ్ అలీ (Asif Ali), లాల్ (Lal), అపర్ణ బాలమురళి (Aparna Balamurali) తదితరులు నటించారు. మలయాళంలో ఇది ఒక మాస్టర్ పీస్ అని అంటున్నారు. ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతో నిర్మాత బన్నీ వాసు (BunnyVasu) ఈ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి పేరొచ్చింది. 2018FilmOTTReleaseDate

2018c.jpg

అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో స్ట్రీమింగ్ కి సిద్ధం 2018OTTStreaming అవుతోంది. ఈ '2018' సినిమా ఓటిటి హక్కులు సోనీ లివ్ (SonyLiv) సొంతం చేసుకుంది. జూన్ 7 (June7) వ తేదీన ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నామని సోనీ లివ్ ఒక ప్రకటనలో తెలిపింది. సోనీ లివ్ తన సాంఘీక మాధ్యమం అయినా ట్విట్టర్ లో ఈ విషయాన్ని ప్రకటించింది.

ఈ సినిమా 2018 లో కేరళను చుట్టుముట్టిన వరదల నేపథ్యంలో తీసిన సినిమా. అప్పుడు వరదలు కేరళ రాష్ట్రాన్ని వణికించాయి, కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయాయి. అటువంటి సమయంలో ప్రజల్లోనే కొంతమంది తమ వంతు సహాయంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి వందలమంది ప్రజల ప్రాణాలను రక్షించటంలో సాయపడ్డారు. అలా సహాయం చెయ్యడంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ సినిమా మానవ సంబంధాలు, అవి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ధనిక, పేద అనీ బేధం లేకుండా అందరినీ ఎలా కలుపుతుంది అనే విషయం ఈ చిత్రం లో బాగా చూపించారు.

Updated Date - 2023-05-30T13:12:22+05:30 IST