Madhavi latha : కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్‌ఎస్‌కు.. నా మార్కులు అంటూ సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-12-04T13:11:51+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో  కాంగ్రెస్‌ గెలుపొందడంపై హీరోయిన్  మాధవీలత (Madhavi latha)సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP)పార్టీలో ఉన్నా ఆమె కాంగ్రెస్‌ పార్టీ గెలుపుపై ఇన్స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇక తెలంగాణలో నడిచేది రావణ రాజ్యమే అని కామెంట్‌ చేశారు.

Madhavi latha : కాంగ్రెస్‌తో పోలిస్తే  బీఆర్‌ఎస్‌కు.. నా మార్కులు అంటూ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో  కాంగ్రెస్‌ గెలుపొందడంపై హీరోయిన్  మాధవీలత (Madhavi latha)సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP)పార్టీలో ఉన్నా ఆమె కాంగ్రెస్‌ పార్టీ గెలుపుపై ఇన్స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇక తెలంగాణలో నడిచేది రావణ రాజ్యమే అని కామెంట్‌ చేశారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్‌లో ఏముందంటే.. ''ఐదేళ్ల తర్వాత తెలంగాణలో తినడానికి తిండి ఉండదు, ఉద్యోగాలు రావు, మహిళలకు భద్రత కరువవుతుంది. హిందూ పండుగలు జరగవు, స్వేచ్చ అనేది కనిపించదు. తెలంగాణ కాంగ్రెస్‌ లవర్స్‌ అందరికీ నా శుభాకాంక్షలు. ఇకపై రావణ సామ్రాజ్యమే. ఎంజాయ్‌ చేయండి’’ అని ఇన్స్టా  పోస్ట్‌లో పేర్కొంది. అంతే కాదు.. కాంగ్రెస్‌తో పోలిస్తే. బీఆర్‌ఎస్‌కు 99 మార్కులు ఇస్తాను’ అని కామెంట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (Madhavi latha Comments on Congress)

Madhavli-latha-post.jpg

నెటిజన్లు మాత్రం మాధవీలతను కామెంట్లతో ఓ ఆట ఆడుకుంటున్నారు. "అది ప్రజలు ఇచ్చిన తీర్పు. దానిని అందరూ గౌరవించాలి. ఓసారి నువ్వు  పార్టీ నుంచి బయటకొచ్చి చూడు. లోకం ఎలా ఉందో తెలుస్తుంది’ అని ఓ నెటిజెన్  కామెంట్‌ చేశారు. మణిపూర్‌లో ఓ మహిళను నగ్నంగా రోడ్డు మీద నడిపించిన సమయంలో రూలింగ్‌లో ఉన్న నీ పార్టీ ఏం చేసింది? అని ప్రశ్నించాడు మరో నెటిజన్. విమెన్  సేఫ్టీ గురించి మీరు మాట్లాడొద్దు అంటూ హెచ్చరించాడు.

"నచ్చావులే’ చిత్రంతో హీరోయిన్  గా  కెరీర్‌ ప్రారంభించింది మాధవీలతా.  ఆడపాదడపా అవకాశాలు అందుకున్నా.. చెప్పుకోదగ్గ విజయాలేవీ వరించలేదు. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి బీజేపీ పార్టీలో చేరింది. 2019లో గుంటూరు వెస్ట్‌లో ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. 

Updated Date - 2023-12-04T13:25:50+05:30 IST