Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ABN , First Publish Date - 2023-04-06T17:57:01+05:30 IST
సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో ఎదిగిన నటుడు విష్వక్ సేన్ (Vishwak Sen). తన ఆటిట్యూడ్, వేష, భాషలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). నివేదా పేతురాజ్ (Nivtha Pethuraj) హీరోయిన్ పాత్రను పోషించారు.
సినీ ఇండస్ట్రీలో స్వ శక్తితో ఎదిగిన నటుడు విష్వక్ సేన్ (Vishwak Sen). తన ఆటిట్యూడ్, వేష, భాషలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). నివేదా పేతురాజ్ (Nivtha Pethuraj) హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ సినిమాకు విష్వకే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో మార్చి 22న విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. థియేటర్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెర దించుతూ ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది.
‘దాస్ కా ధమ్కీ’ ఓటీటీ రైట్స్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. భారీ ధరను చెల్లించి రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 14 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘దాస్ కా ధమ్కీ’ లో విష్వక్ సేన్ ద్వి పాత్రా భినయం పోషించారు. ఈ సినిమా యాక్షన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది.
‘దాస్ కా ధమ్కీ’ కథ విషయానికి వస్తే..కృష్ణదాస్ (విష్వక్ సేన్) అనాథ. ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుంటారు. ఒకరోజు ఆ హోటల్‌కు వచ్చిన కీర్తి ని చూసి ప్రేమలో పడతారు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో తాను వెయిటర్ అన్న విషయాన్ని దాచి పెట్టి.. కోటీశ్వరుడిలా నటించడం మొదలుపెడతారు. తనను తాను సంజయ్ రుద్ర అనే పేరుతో పరిచయం చేసుకుంటారు. ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో అని అబద్దాలు చెబుతారు. కీర్తి ప్రేమలో పడిన తర్వాత ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. ఫలితంగా అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఆమె ప్రేమలో పడి ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. అదే సమయంలో అతడి జీవితంలోకి రావు రమేష్ ఎంట్రీ ఇస్తారు. సంజయ్ రుద్ర అనే వ్యక్తి ఉన్నాడని చెపుతారు. కృష్ణ దాస్‌కు, సంజయ్ రుద్రకు ఉన్న సంబంధం ఏంటీ..? దాస్ ప్రేమకథ ఏమైంది..? అనేది తెలుసుకోవాలంటే సినిమాను తప్పక చూడాల్సిందే.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
Salman Khan: ఓటీటీలపై సంచలన వ్యాఖ్యలు
MM. Keeravani: బాలీవుడ్ సినిమాకు సంగీతం.. హీరో ఎవరంటే..?
Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..
Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..
Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?