Vishwak Sen: విశ్వక్ సేన్ ‘ఫ్యామిలీ ధమాకా’ అక్కడ షురూ అయింది

ABN , First Publish Date - 2023-09-04T20:53:28+05:30 IST

ఆహా ఓటీటీలో విశ్వక్ సేన్ హోస్ట్ చేయబోతోన్న కొత్త షో ‘ఫ్యామిలీ ధమాకా’. ఈ షో తో OTT ప్రపంచంలోకి విశ్వక్ సేన్ అడుగుపెట్టబోతున్నారు. ఈ షో‌కి సంబంధించిన ప్రీ లాంచ్ కార్యక్రమాన్ని కాకినాడలో గ్రాండ్‌గా నిర్వహించారు.

Vishwak Sen: విశ్వక్ సేన్ ‘ఫ్యామిలీ ధమాకా’ అక్కడ షురూ అయింది
Vishwak Sen Hosted Family Dhamaka Event

ఇప్పటి వరకు హీరోగా, దర్శకుడిగా అలరించిన విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇప్పుడు హోస్ట్‌గా మారుతున్నారు. రీసెంట్‌గా తను హోస్ట్ చేస్తున్న షోకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్.. ట్విస్ట్‌లా మారి అందరినీ బోల్తా కొట్టించింది. ‘ఫ్యామిలీ’ అనగానే అంతా పెళ్లి చేసుకోబోతున్నాడనేలా.. ఊహించేసుకున్నారు. ఆ తర్వాత ఆయన అసలు ‘ఫ్యామిలీ’ మ్యాటర్‌ను రివీల్ చేశారు. ఆహా ఓటీటీలో విశ్వక్ సేన్ హోస్ట్ చేయబోతోన్న కొత్త షో ‘ఫ్యామిలీ ధమాకా’ అని అందరికీ అప్పుడర్థమైంది. ఈ షో తో OTT ప్రపంచంలోకి విశ్వక్ సేన్ అడుగుపెట్టబోతున్నారు.


ఈ ‘ఫ్యామిలీ ధమాకా’ (Family Dhamaka) షోకి సంబంధించిన వివరాలను ఆహా (Aha) కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రీమియర్‌ ప్రారంభం అవుతుందని.. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రం సెప్టెంబరు 7నే మొదటి ఎపిసోడ్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది ఆహా. గోల్డ్ సబ్‌స్క్రైబర్ కావాలంటే రూ. 899 చెల్లించాలని కూడా పేర్కొంది. 4K డాల్బీ ఆడియో, యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్‌తో పాటు తెలుగు మరియు తమిళ ప్లాట్‌ఫారమ్‌లకు ఒక సంవత్సరం యాక్సెస్‌ పొందే అవకాశం గోల్డ్ సబ్‌స్క్రైబర్స్‌‌కి ఆహా కల్పించింది.

Family-dhamaka.jpg

ఇక ఈ ఫ్యామిలీ ధమాకా షో ప్రీ లాంచ్ కార్యక్రమాన్ని కాకినాడ (Kakinada)లోని SRMT INOX మాల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. కాకినాడలోని కుటుంబాలతో కలిసి ఆహా ఫ్యామిలీ ధమాకా గేమ్‌ ఆడించారు. ఆ తర్వాత షో యొక్క థీమ్ సాంగ్ మీద అందరితో డాన్స్ చేయించారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయిందని.. రాబోయే ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిందని ఫ్యామిలీ ధమాకా షో ప్రీ లాంచ్ నిర్వాహకులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!

************************************

*Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు

*************************************

*Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..

*************************************

*Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

************************************

*Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

***********************************

Updated Date - 2023-09-04T21:00:44+05:30 IST