Khushi: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ సినిమా

ABN , First Publish Date - 2023-10-25T17:55:43+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషీ' ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని వారల క్రితం నెంబర్ వన్ గా వున్న ఈ సినిమా ఇంకా ట్రేండింగ్ అవుతూనే వుంది. శివ నిర్వాణం దర్శకత్వం వహిచిన ఈ సినిమా ఇప్పుడు టాప్ టెన్ లో ఏడోదిగా ట్రేండింగ్ లో వుంది అని చెపుతున్నారు.

Khushi: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో  ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ సినిమా
A still from Khushi film

విజయ్ దేవరకొండ (VijayDeverakonda), సమంత (Samantha) జంటగా నటించిన 'ఖుషి' #Khushi సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ టాక్ వచ్చినా, కొన్ని ఏరియాస్ లో బ్రహ్మాండంగా నడిచింది, బ్రేక్ ఈవెన్ కూడా అయింది. అలాగే ఈ సినిమా తమిళంలో బాగా రెవిన్యూ రాబట్టింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (MythriMovieMakers) బ్యానర్ లో నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ ప్రేమ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'ఖుషి'ని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ (ShivaNirvana).

ఈ సినిమాలో విప్లవ్ గా విజయ్ దేవరకొండ, ఆరాధ్యగా సమంత నటించారు. సమంతకి ఆరోగ్యం బాగోలేక ఈ సినిమా విడుదలలో జాప్యం కూడా జరిగింది. ఆ తరువాత ఆమె ఈ సినిమా చేసి తన ఆరోగ్య విషయమై అమెరికాకు వెళ్ళిపోయింది. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం కాశ్మీర్ లో జరిగింది.

khushinetflix.jpg

అలాగే ఈ నెల 1న 'ఖుషి' సినిమా నెట్ ఫ్లిక్స్ #Netflix లో డిజిటల్ స్ట్రీమింగ్ కూడా అయింది, అక్కడ కూడా ఎక్కువమంది చూసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా స్ట్రీమింగ్ అవటం, అలాగే టాప్ 1గా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితమైన రెస్పాన్స్ వస్తోంది.టాప్ 10లో 7 ప్లేస్ లో ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Updated Date - 2023-10-25T17:55:43+05:30 IST