Gandeevadhari Arjuna: వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది..
ABN , First Publish Date - 2023-09-20T22:31:22+05:30 IST
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) హీరోగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna Movie). సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ మీద నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని రాబట్టుకోవడంతో.. థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పెట్టలేదు. దీంతో ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘గాండీవధారి అర్జున’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన డిటైల్స్ వచ్చేశాయ్.. (Gandeevadhari Arjuna OTT Release Date)
‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) ఈ నెల 24వ తేదీ నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని.. సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘సెప్టెంబరు 24న రానున్నది గాండీవధారి అర్జున సినిమానే కాదు ఓ ఏజెంట్ తెచ్చే ధైర్యం కూడా’ అంటూ ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో థియేటర్లలో మిస్ అయిన వారంతా.. ఈ సినిమాని ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు. మేకర్స్ కూడా ఈ సినిమా ఓటీటీలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
‘గాండీవధారి అర్జున’ కథ విషయానికి వస్తే.. (Gandeevadhari Arjun story).. భారతదేశానికి చెందిన కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) లండన్‌లో జరుగుతున్న గ్లోబల్ సమావేశానికి హాజరవుతాడు. ఆయనతో పాటు అతని పీఏ ఐరా (సాక్షి వైద్య) కూడా ఉంటుంది. అతన్ని రహస్యంగా కలిసి ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడానికి శృతి (రోషిణి ప్రకాష్) అనే అమ్మాయి ప్రయత్నం చేస్తుంది, కానీ అప్పుడు మంత్రి మీద ఎటాక్ జరుగుతుంది. అందులో మంత్రికి సెక్యూరిటీగా వున్న వ్యక్తి గాయపడతాడు, కానీ మంత్రికి ప్రాణహాని ఉందని తెలిసి గాయపడిన అతను అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) అనే అతన్ని మంత్రికి సెక్యూరిటీగా ఉంటే బాగుంటుంది అని చెప్తాడు. ఆదిత్య రాజ్ పీఏ, అర్జున్ వర్మ ఒక్కప్పుడు ప్రేమికులు. మొదట్లో ఐరా నిరాకరించినా, మంత్రి బాగోగులు గురించి ఆలోచించి అర్జున్ వర్మకి ఒకే చెపుతుంది. ఈలోగా లండన్ వెళ్లిన కేంద్ర మంత్రి గ్లోబల్ మీట్‌లో విదేశీయ కంపెనీలు భారత దేశంలో డంప్ చేస్తున్న చెత్తని ఏ విధంగా ఆపాలి అనే ఫైల్ మీద సంతకం పెట్టకుండా రణవీర్ (వినయ్ రాయ్) అడ్డుకుంటాడు? అతను ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఈ రణవీర్‌కి కేంద్ర మంత్రికి వున్న సంబంధం ఏంటి? ఐరా, అర్జున్ వర్మ ఇంతకు ముందు ఎక్కడ కలిశారు, ఎందుకు విడిపోయారు? ఇలా భారతదేశంలో డంప్ చేస్తున్న చెత్త (గార్బేజ్) వలన ఏమవుతుంది? అర్జున్ వర్మకి వీటన్నిటికీ లింక్ ఏంటి? కేంద్రమంత్రిని అర్జున్ వర్మ ఎలా కాపాడాడు? వీటన్నిటికీ సమాధానాలు కావాలనే ‘గాండీవధారి అర్జున’ సినిమా చూడాల్సిందే..
ఇవి కూడా చదవండి:
============================
*Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఆ హీరోయిన్ అవుట్..
***********************************
*Vishal: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం ఇచ్చినందుకు హ్యాపీ..
**********************************
*Theppa Samudram: కాబోయేవాడు యాడున్నాడో.. మస్త్‌గా ఎక్కుతోన్న మంగ్లీ మాస్ బీట్ సాంగ్
*********************************
*Sai Pallavi: ఇలా తెలుగు ప్రేక్షకులను మళ్లీ కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది
*************************************
*King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?
**************************************
*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..
***************************************