ఓటీటీలోకి ‘ఆదికేశవ’.. ఎందులో, ఎప్పటి నుంచంటే?
ABN , Publish Date - Nov 26 , 2023 | 05:21 PM
ఇటీవలే రెండు రోజుల క్రితం థియేటర్లలో విడదలైన ఆదికేశవ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ తేదీ, ఓటీటీ ఫ్లాట్ ఫాం ఖరారయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే రెండు రోజుల క్రితం థియేటర్లలో విడదలైన ఆదికేశవ (Aadikeshava) సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ తేదీ, ఓటీటీ (OTT) ఫ్లాట్ ఫాం ఖరారయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej), శ్రీలీల (Sree leela) జంటగా నటించిన ఈ సినిమాలో మళయాల ఆగ్ర నటుడు జోజు జార్జ్ ప్రతి నాయకుడిగా నటించగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు, జీవీ ప్రకాశ్ కుమార్(gv prakash) సంగీతం అందించాడు.
అయితే ఈ సినిమా రిలీజైన మొదటిరోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, 90ల నాటి రొటీన్ మాస్ మసాలా కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఏ రకంగానూ ప్రేక్షకులను మెప్పించలేక మూడు రోజులకే చతికిల పడింది. వైష్ణవ్ తేజ్(Panja Vaisshnav Tej) ఖాతాలో కొండపొలం, రంగరంగ వైభవంగా తర్వాత ఆదికేశవతో ముచ్చటగా మూడో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసుకోగా, శ్రీలీల (Sree leela) స్కంద తర్వాత రెండో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉండగా సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకువచ్చే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఇప్పుడు సినిమా ఫలితం తేడాగా ఉండడంతో ముందుగానే తీసుకొచ్చే అవకాశం ఉంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం ఓటీటీలోకి రావాల్సి ఉండగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న సినిమాను నెట్ ఫ్లిక్స్ (NETFLIX)లోకి తీసుకు రానున్నట్లు సమాచారం. మరి ఇక్కడైనా సినిమా ఆలరిస్తుందేమో చూడాలి.