OTT: ఈ వారం సందడి ఈ చిత్రాలదే

ABN , Publish Date - Dec 25 , 2023 | 02:06 PM

ఈ ఏడాది చివరికి వచ్చేసింది. నెలాఖరులో సినిమాల హవా అంతగా లేదు. కేవలం రెండు మూడు చిత్రాల విడుదలతో ఈ ఏడాది ముగుస్తోంది.  ఓటీటీలో సందడి చేయడానికి చాలా  సినిమాలే క్యూ కట్టాయి.ఈ చిత్రాలేంటో చూద్దాం.

OTT: ఈ వారం సందడి ఈ చిత్రాలదే

ఈ ఏడాది చివరికి వచ్చేసింది. నెలాఖరులో సినిమాల హవా అంతగా లేదు. కేవలం రెండు మూడు చిత్రాల విడుదలతో ఈ ఏడాది ముగుస్తోంది.  ఓటీటీలో సందడి చేయడానికి చాలా  సినిమాలే క్యూ కట్టాయి.ఈ చిత్రాలేంటో చూద్దాం.

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘డెవిల్‌’. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ సరసన సంయుక్త మీనన్‌, మాళవిక నాయర్‌ నటించారు. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ‘పీరియాడిక్‌ డ్రామాలో ఈ చిత్రం తెరకెక్కింది. బ్రిటిష్‌ రహస్య గూఢాచారిగా కల్యాణ్‌రామ్‌ ఆకట్టుకునేలా నటించారు. ఆయన చేసే స్టైలిష్‌ పోరాట ఘట్టాలు, కథలోని డ్రామా, థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని, విజువల్స్‌ మరో స్థ్థాయిలో ఉంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి.

బబుల్‌గమ్‌.. లవ్‌స్టోరీ

రాజీవ్‌ కనకాల, సుమ దంపతుల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్‌’ క్షణం సినిమా ఫేం రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మహేశ్వరి మూవీస్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఈ సినిమా కూడా ఈ నెల 29 విడుదలకానుంది. రోషన్‌, మానస గ్రేస్‌తో తమ పాత్రల్ని పోషించారని, పాత్రల్ని అర్థం చేసుకున్న తీరు సర్‌ప్రైజ్‌ చేసిందని’’ అని చిత్ర బృందం చెబుతోంది. వీటితోపాటు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వ్యూహం కూడా ఈ తేదిలోనే విడుదలవుతుందని వార్తలొస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది.

 ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే  చిత్రాలేంటో చూద్దాం! 

నెట్‌ఫ్లిక్స్...

డిసెంబరు 25 : స్నాగ్‌ (హాలీవుడ్‌) 

రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) 

డిసెంబరు 26 : ఖో గయే హమ్‌ కహా (హిందీ) 

థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) 

ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) 

హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా)

డిసెంబరు 28 : లిటిల్‌ డిక్సీ (హాలీవుడ్) 

లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) 

మిస్ శాంపో (మాండరిన్ సినిమా) 

పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) 

డిసెంబరు 29 : అన్నపూరణి (తమిళ) 

డిసెంబరు 29 : బెర్లిన్‌ (వెబ్‌సిరీస్‌) 

డిసెంబరు 29 : శాస్త్రి (చిత్రం) 

డిసెంబరు 31 : బీస్ట్‌ (మూవీ) 

ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) 

అమెజాన్ ప్రైమ్..

డిసెంబరు 27  : కటాటన్ ఎస్ఐ బాయ్ 

డిసెంబరు 31 : టైగర్ 3 (హిందీ చిత్రం) 

హాట్‌స్టార్..

డిసెంబరు 26 : మంగళవారం (తెలుగు సినిమా) 

డిసెంబరు 29 : 12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ)

జీ5...

డిసెంబరు 29 : డోనో (హిందీ) 

డిసెంబరు 29 : సఫేద్‌ (హిందీ) 

డిసెంబరు 29 : వన్స్‌ అప్‌ఆన్‌ టూ టైమ్స్‌ (హిందీ) 

జియో సినిమా..

డిసెంబరు 25: ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) 

డిసెంబరు 30ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా)

బుక్ మై షో..

ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 29

ఆహా

డిసెంబరు 28 : కీడా కోలా (తెలుగు) 

Updated Date - Dec 25 , 2023 | 02:08 PM