Dhootha web series: 38 భాషల్లోకి డబ్ చేసిన నాగచైతన్య వెబ్ సిరీస్

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:29 AM

'ధూత' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యాక పెద్ద విజయం సాధించటమే కాకుండా, ట్రెండింగ్ లో కూడా వుంది. విక్రమ్ కె కుమార్ దర్శకుడిగా, నాగ చైతన్య కథానాయకుడిగా, శరత్ మరార్ నిర్మాతగా వున్న ఈ తెలుగు వెబ్ సిరీస్ 38 భాషల్లోకి డబ్ అయిందంటే ఇది ఎంత పెద్ద విజయమో కదా మరి.

Dhootha web series: 38 భాషల్లోకి డబ్ చేసిన నాగచైతన్య వెబ్ సిరీస్
Dhootha web series is a big success in OTT

ఈమధ్య కాలంలో తెలుగులో ఏదైనా వెబ్ సిరీస్ వైరల్ అయింది అంటే మాత్రం అది ఖచ్చితంగా 'ధూత' #Dhootha వెబ్ సిరీస్ మాత్రమే. విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ (Supernatural) వెబ్ సిరీస్ లో నాగ చైతన్య (Naga Chaitanya) కథానాయకుడు, శరత్ మరార్ (Sharath Marar) నిర్మాత. అమెజాన్ ప్రైమ్ (AmazonPrimeVideo) లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ చాలా పెద్ద ఘన విజయం సాధించింది. ఒక తెలుగు వెబ్ సిరీస్ ఇంత పెద్ద ఘన విజయం సాధించటం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి. (Dhootha web series dubbed in 38 languages with subtitles)

"నన్ను అందరూ 'ధూత' నిర్మాత అని పిలుస్తున్నారు, అలాగే పరిచయం కూడా చేయిస్తున్నారు. అంటే ఈ వెబ్ సిరీస్ వలన నాకు ఎంతటి గౌరవం వచ్చిందో, అది ఎంత విజయం సాధించిందో నేను వూహించగలను," అని చెప్పారు నిర్మాత శరత్ మరార్. ఒక్క తెలుగు నుండే కాకుండా, శరత్ మరార్ కి కేరళ, తమిళ నాడు, హిందీ ఎక్కడెక్కడి నుండో ఫోన్స్ వచ్చాయి, మెసేజ్ లు వచ్చాయి, ఇంకా వస్తున్నాయి, అంటే ఆ సిరీస్ ఎంతలా టీవిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. (Naga Chaitanya's 'Dhootha' web series trending many weeks on Amazon Prime Video)

sharathmararvikramnagachait.jpg

నటుడు నాగ చైతన్య మొదటిసారిగా వెబ్ సిరీస్ లో ఈ 'ధూత' ద్వారానే ఓటిటి లోకి ఆరంగేట్రం చేశారు. అలాగే ఎన్నో సినిమాలకి ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకి దర్శకుడిగా చేసిన విక్రమ్ కె కుమార్ కూడా మొదటిసారిగా ఈ వెబ్ సిరీస్ తో ఓటిటి లోకి వచ్చారు. అతను ఇందులో ఒక అతీంద్రియ శక్తులను (Supernatural) నేపధ్యంగా తీసుకొని ఈ వెబ్ సిరీస్ చేసి, ఇందులో ఒక పీరియడ్ డ్రామాని కూడా చూపించి చివరి ఎపిసోడ్ వరకు ఆ సస్పెన్స్ కొనసాగించారు.

ఈ వెబ్ సిరీస్ ఎక్కువ భాగం విశాఖపట్నంలో షూటింగ్ చేశారు. అయితే అక్కడ షూటింగ్ చెయ్యడం ఏముంది ఇప్పుడు అందరూ విశాఖపట్నంలో షూటింగ్ చేస్తున్నారు కదా అని అనుకుంటే అది పొరపాటే, ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కి ఒక స్పెషల్ వుంది. ఏంటంటే అది ఈ వెబ్ సిరీస్ లో పాత కారులు (vintage cars) వాడారు. ఎందుకంటే ఇందులో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు పీరియడ్ డ్రామా కాబట్టి అప్పటి పాత తరం కారులు వాడాలి. "ఇదొక్కటే కొంచెం కష్ట పడ్డాము అని చెప్పొచ్చు. కష్ట పడ్డాము అంటే అదేదో అందరం ఓవర్ నైట్ పని చేశామనో లేదా ఇంకోటో కాదు. హైద్రాబాదులో ఒక కంపెనీ వాళ్ళ దగ్గర ఈ పాత కారులను అద్దెకు తీసుకొని అవి జాగ్రత్తగా హైదరాబాదు నుండి విశాఖపట్నం తీసుకెళ్లడం అది కొంచెం కష్టమైన పని" అని చెప్పారు శరత్ మరార్. (We have hired a few vintage cars, and moving them from Hyderabad to Visakhapatnam for the shooting is the big challenge, says producer Sharath)

dhoothateamone.jpg

ఒక్క కారుకు ఎక్కడా ఒక్క చిన్న గీత కూడా పడకుండా ఒక పెద్ద ట్రక్ మాట్లాడుకొని, అందులో ఈ పాత కారులను ఎక్కించి జాగ్రత్తగా విశాఖపట్నం తీసుకెళ్లామని, అయితే ఈ పాత కారులతో పాటు వాళ్ళ మనిషి కూడా వచ్చాడని, అవి షూటింగ్ అయ్యాక, మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి తీసుకెళ్ళి అప్పచెప్పడం అవన్నీ కొంచెం బాధ్యతగా చేయాల్సి వచ్చిందని చెప్పారు శరత్.

ఇప్పుడు ఈ 'ధూత' వెబ్ సిరీస్ 38 భాషల్లోకి డబ్ అయిందని, అన్ని భాషల్లో దీనికి వాళ్ళ సొంత భాషలో సబ్ టైటిల్స్ వేసి మరీ చూపిస్తున్నారని చెప్పారు శరత్ మరార్. "ఈ వెబ్ సిరీస్ ఇంత విజయం సాధిస్తుందని, ఇన్ని భాషల్లోకి విడుదలవడం, అందరికి నచ్చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఇది మరువలేనిదని," చెప్పారు శరత్ మరార్. దర్శకుడు విక్రమ్ ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ కి ఎటువంటి కథను ఇవ్వాలన్నది అప్పుడే ఒక చిన్న ఆలోచన వచ్చిందని, ఓటిటి ఛానల్ ఒకే అన్న తరువాత రెండో సీజన్ కూడా మొదలెట్టేస్తామని చెప్పారు శరత్ మరార్.

-- సురేష్ కవిరాయని

Updated Date - Dec 26 , 2023 | 11:29 AM